Dengue D2 Strain: ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ విజృంభణ... డెంగీ మరణాలకు డీ2 స్ట్రైయిన్ కారణం... ప్రాణాంతక రక్తస్రావం కలిగిస్తుందంటున్న ఐసీఎంఆర్ వైద్యులు
ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఈ వ్యాధితో మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఐసీఎమ్ఆర్ వైద్యులు తెలిపారు. డెంగీ డీ2 స్ట్రెయిన్ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ మరొక ఆరోగ్య పరిస్థితిపై పోరాడుతోంది. ఆ రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతంలో డెంగీ, దోమ ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధు కేసులు భారీగా పెరిగాయి. ఫిరోజాబాద్, మధురలో గత రెండు వారాల్లో ఇప్పటివరకు 100కి పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఈ వైరల్ వ్యాధులు రాష్ట్రంలోని తూర్పు ప్రాంతానికి కూడా వ్యాపించింది.
ఉత్తర్ ప్రదేశ్ లో డెంగీ విజృభిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర, ఆగ్రా, ఫిరోజాబాద్ జిల్లాల్లో అత్యధిక మరణాలు డీ2 స్ట్రెయిన్ వలన వచ్చిన డెంగీ జ్వరం కారణంగా సంభవించాయని ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ గురువారం తెలిపారు. ఇది ప్రాణాంతకమైన రక్తస్రావానికి కారణమవుతుందని చెప్పారు.
డీ2 స్ట్రెయిన్ వల్లే
"మధుర, ఆగ్రా ఫిరోజాబాద్‌లో నమోదైన మరణాలు డెంగీ డీ2 స్ట్రెయిన్ వలన సంభవించాయి. ఇది రక్తస్రావాన్ని కలిగించవచ్చు, ఇది ప్రాణాంతకం" అని డా.భార్గవ తెలిపారు. వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం), డాక్టర్ వీకే పాల్ ప్రజలకు సూచించారు. డెంగీ వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని, మరణలు కూడా సంభవిస్తాయని తెలిపారు.
డెంగీకి వ్యాక్సిన్ లేదు
"దోమతెరలు, దోమ వికర్షకాలు ఉపయోగించి దోమ కాటు, వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎందుకంటే డెంగీ మరణానికి దారితీస్తుంది. డెంగీ వ్యాధికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. కాబట్టి డెంగీని సీరియస్‌గా తీసుకోవడం ముఖ్యం. మలేరియా కూడా తీవ్ర ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. ఈ వ్యాధుల నివారణపై పోరాడాలి" అని డాక్టర్ పాల్ చెప్పారు.
కేంద్ర బృందం అధ్యయనం
డెంగీ వైరస్ సెరోటైప్ 2 (DENV-2 లేదా D2) అత్యంత ప్రమాదకరమైన స్ట్రెయిన్ అని, వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇటీవల ఒక కేంద్ర బృందం ఫిరోజాబాద్ జిల్లాలో పర్యటించింది. డెంగీ ఎక్కువగా నమోదవ్వడానికి స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్ కారణమని తేల్చింది. డెంగీ సంక్రమణలో హౌస్ ఇండెక్స్, కంటైనర్ ఇండెక్స్ 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) ఇద్దరు ఈఐఎస్ (ఎపిడెమిక్ ఇంటెలిజెన్స్ సర్వీస్) అధికారులను నియమించింది. వీరు రాబోయే 14 రోజుల పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని పలు జిల్లాలో పర్యటించి డెంగీ వ్యాప్తికి కారణాలపై అధ్యయనం చేయనున్నారు.
Also Read: Afghanistan Crisis: ఓరినీ.. ఇదేం పైత్యం.. విమానానికి తాడు కట్టి ఊయల ఊగడమేంటయ్యా తాలిబన్స్