Top Headlines Today: వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh News | గత వైసీపీ ప్రభుత్వం తప్పిదాల వల్లే రాష్ట్రంలో వరద ముప్పు తీవ్రత అధికమైందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. హైడ్రా పనితీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
Telangana News Today | నన్ను తిడితే అభిమానులకు కోపం రాదా? టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మరోసారి జగన్ సంచలన కామెంట్స్
చంద్రబాబు వైఫల్యాల వల్ల వచ్చిన వరదల కారణంగా 60 మంది వరకు మృతి చెందారని... ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. ఇలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని అన్నారు. అసలు నాడు తనను అసభ్య పదజాలంతో దూషించినా తామంతా సంయమనం పాటించామన్నారు. ఇప్పుడు అరెస్టు అయిన వారెవరూ ఆనాడు ఆ ఘటన జరిగిన ప్రదేశంలో లేదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైసీపీ పాలన సైడ్ ఎఫెక్టులే - దోపిడీ తప్ప ఒక్క పనీ చేయలేదు - చంద్రబాబు ఘాటు విమర్శలు
వైఎస్ జగన్ పాలనా నిర్వాకం వల్లనే వరదలు వచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. కొల్లేరు ,తమ్మిలేరు పరివాహక ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. గత ఏడాదిలోనే బుడమేరుకి గండ్లు పడితే కనీసం పట్టించుకోకపోవడం వల్లనే సమస్యలు వచ్చాయన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బుడమేరు ఆధునీకరణ కోసం మంజూరు చేసిన పనులను రద్దు చేశారనిమండిపడ్డారు. బుడమేరు మొత్తం జగన్ మనుషులు ఆక్రమించుకుని అమ్మేశారని.. నీళ్ళు పోవాల్సిన బుడమేరుని కబ్జా చేసి విజయవాడను మంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సమావేశం
ఈ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఈ మధ్య కాలంలో భారీగా వరదలు వచ్చి ఖమ్మం మొత్తాన్ని నీట ముంచేశాయి. దీంతో బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఆ చెక్‌ను స్వయంగా సీఎం రేవంత్‌ను కలిసి పవన్ కల్యాణ్ అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ ను కలిశారు. వరద బాధితులను ఆదుకునేందుకు తాను ప్రకటించిన సాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆక్రమణదారులు జైలుకే- స్వచ్చందంగా వదలుకోకుంటే చర్యలు తప్పవు- హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన కామెంట్స్
హైడ్రా పనితీరు భవిష్యత్ కార్యచరణపై తెలంగాణ ముఖ్యమంత్రి సంచలన కామెంట్స్ చేశారు. ఆక్రమణదారులను అవసరమైతే జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ముందుగానే మేల్కొంటే మాత్రం మంచిదని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు- ఐదేళ్ల పాటు ఊరట
వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్‌పోర్టు విషయంలో విజయవాడ కోర్టు ఆదేశాలను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మూడో తేదీన కుటుంబసమేతంగా లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ పాస్‌పోర్టు వివాదంతో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఏడో తేదీన వెళ్తారని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యం కాలేదు. 2019లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులు డిప్లొమాట్ పాస్ పోర్టును అదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి