YS Jagan Passport Issue: వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన హైకోర్టు- ఐదేళ్ల పాటు ఊరట
YS Jagan: పాస్‌పోర్టు విషయంలో జగన్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన పాస్‌పోర్ట్‌ను ఐదేళ్లకు రెన్యువల్ చేసేందుకు హైకోర్టు ఓకే చెప్పింది.
The AP High Court has given Big Relief To Jagan: వైసీపీ అధినేత జగన్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్‌పోర్టు విషయంలో విజయవాడ కోర్టు ఆదేశాలను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఐదేళ్ల పాటు రెన్యువల్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మూడో తేదీన కుటుంబసమేతంగా లండన్ వెళ్లాల్సి ఉన్నప్పటికీ పాస్‌పోర్టు వివాదంతో ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యింది. ఏడో తేదీన వెళ్తారని అనుకున్నప్పటికీ అది కూడా సాధ్యం కాలేదు.
2019లో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులు డిప్లొమాట్ పాస్ పోర్టును అదించారు. ఆ పాస్ పోర్టు మీద ఐదేళ్లు విదేశాలకు వెళ్లి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పదవిని కోల్పోయారు. దీంతో డిప్లొమాట్ పాస్ పోర్టు ఆటోమేటిక్ రద్దైపోయింది. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ తన పాత పాస్ పోర్టుపై ఆధారపడాల్సి వచ్చింది.
అయితే ఈ పాస్‌పోర్టు విషయంలో విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం మంత్రి వేసిన పరువునష్టం కేసులో ఆయన పాస్‌పోర్టు సహా ఇతర అంశాలపై ఆంక్షలు పెట్టింది. కేవలం ఒక ఏడాది మాత్రమే పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకోవాలని చెప్పింది. దీంతో సమస్యలు వస్తాయని గ్రహించిన జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లకు పాస్ పోర్టు రెన్యూవల్ చేసేలా అధికారులను ఆదేశించాలని అప్పీల్ కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.