Ballari Gali : పదేళ్ల తర్వాత బళ్లారి గడ్డపై గాలి జనార్ధన్ రెడ్డి హల్‌చల్...! ఇక లెక్క మారుస్తారా ?
మైనింగ్ కేసులతో బళ్లారిలో అడుగు పెట్టలేకపోయిన గాలి జనార్దన్ రెడ్డి పదేళ్ల తర్వాత కోర్టు అనుమతితో తన కల నెరవేర్చుకున్నారు. ఇక అక్కడే ఉండి రాజకీయం చేయాలనుకుంటున్నారు.
![Ballari Gali : పదేళ్ల తర్వాత బళ్లారి గడ్డపై గాలి జనార్ధన్ రెడ్డి హల్‌చల్...! ఇక లెక్క మారుస్తారా ? Gaili Janardhan Reddy, who set foot in his home district of Ballari after ten years, has announced that he will take new steps politically Ballari Gali : పదేళ్ల తర్వాత బళ్లారి గడ్డపై గాలి జనార్ధన్ రెడ్డి హల్‌చల్...! ఇక లెక్క మారుస్తారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/12/ec1db620b491a76a29cbc7718c61213c_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అక్రమ మైనింగ్ కేసుల్లో షరతుల బెయిల్ మీద ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి ఇంత కాలం అనుమతి లేకుండా సొంత ఊరు బళ్లారిలో అడుగు పెట్టడానికి పర్మిషన్ లేదు. కానీ సీబీఐ కోర్టు తాజాగా అనుమతులు ఇవ్వడంతో ఆయన హంగామా మధ్య బళ్లారి గడ్డపై అడుగుపెట్టారు. గతంలో ఒకటి రెండు సార్లు ప్రత్యేక అనుమతులతో వచ్చినా ఈ సారి మాత్రం మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదన్న జోష్ ఆయనతో పాటు ఆయన అనుచరుల్లోనూ కనిపించింది.
Also Read: యోగికి షాక్ మీద షాక్! అఖిలేశ్ ఫుల్ జోష్.. భాజపాకు మరో మంత్రి రాంరాం!
బళ్ళారిలో సుదీర్ఘ కాలం తరువాత అడుగుపెట్టిన గాలి జనార్దన్ రెడ్డికి ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు.బళ్లారిలో కనకదుర్గమ్మ గుడిలో తులాభారం సమర్పించి అమ్మవారికి మొక్కులు సమర్పించుకొన్నారు గాలి జనార్దన్ రెడ్డి.ఈ సందర్బంగా ఉద్వేగానిక గురయ్యారు గాలి జనార్దన్ రెడ్డి.దాదాపు పదేళ్ల పాటు బళ్ళారికి దూరంగా వుండాల్సి రావడం దురదృష్టకరం అని అన్నారు.కష్టసమయాల్లో తమ కుటుంభానికి అండగా బళ్ళారి ప్రజలు ఎల్లప్పుడూ అండగా వున్నారని,వారికి దన్యవాదాలు తెలియచేశారు. తన జన్మదినాన్ని అభిమానుల మద్య జరుపుకొన్నారు.ఇక నుంచి బళ్ళారిలోనే వుండి ఈ ప్రాంతానికి సేవ చేసుకొంటానని అన్నారు.
గాలి జనార్దన్ రెడ్డి ఈ పేరు వింటే చాలు బళ్ళారి అడ్డాగా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ పేరుతో ఏవిదంగా వ్యాపారం చేశారో అందరికి తెలిసిందే.ఓబుళాపూరం మైనింగ్ పేరుతో ఆయన చేసిన వ్యాపారం పై అనేక రకాల కేసులు నమోదు అయ్యాయి. అక్రమ మైనింగ్ ,సరిహద్దులను చెరపేశారన్న ఆరోపణలు, పక్కన వారి మైనింగ్ అక్రమించుకొని ఖనిజనాన్ని తవ్వేశారన్న ఆరోపణల ఆయన పై కేసులు నమోదు అయ్యాయి. పదేళ్ళపాటు బళ్ళారిలో అడుగుపెట్టలేకపోయారు.కోర్టు పర్మిషన్ తో ఏవైనా కుటుబ కార్యక్రమాలు వుంటే రెండు, మూడుసార్లు మాత్రమే ఆయన బళ్ళారికి వచ్చారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేకుండా గాలిజనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఆయన తన జన్మదినం రోజున బళ్లారిలో అడుగు పెట్టారు.
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
తన సహచరుడు,మంత్రి శ్రీరాములుతో కలిసి గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో పర్యటించారు. గాలి జనార్దన్ రెడ్డి రాకతో రానున్న రోజుల్లో మళ్ళీ బళ్ళారి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ తరపున ఆయన కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నారు. మరోసారి బళ్ళారిని విడిచే పరిస్థితులు రాకుడదని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా స్థానికంగా సంచలనంగా మారాయి. వివాదాల జోలికి పోకుండా రాజకీయం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)