UP Election 2022: యోగికి షాక్ మీద షాక్! అఖిలేశ్ ఫుల్ జోష్.. భాజపాకు మరో మంత్రి రాంరాం!
ఉత్తర్‌ప్రదేశ్ కేబినెట్ నుంచి మరో మంత్రి రాజీనామా చేశారు. ఇప్పటికే ఒకరు రాజీనామా చేయగా తాజాగా ధారా సింగ్ చౌహాన్ బయటకు వస్తున్నట్లు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలు భాజపాను వీడిపోగా తాజాగా మరో ఓబీసీ మంత్రి పార్టీకి రాంరాం చెప్పారు. ధారా సింగ్ చౌహాన్.. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నుంచి వైదొలిగారు.
ఈ మేరకు ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు రాసిన రాజీనామా లేఖలో ధారా సింగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన పదవికి రాజీనామా చేశారు.
‘सामाजिक न्याय’ के संघर्ष के अनवरत सेनानी श्री दारा सिंह चौहान जी का सपा में ससम्मान हार्दिक स्वागत एवं अभिनंदन!
— Akhilesh Yadav (@yadavakhilesh) January 12, 2022
सपा व उसके सहयोगी दल एकजुट होकर समता-समानता के आंदोलन को चरम पर ले जाएँगे… भेदभाव मिटाएँगे! ये हमारा समेकित संकल्प है!
सबको सम्मान ~ सबको स्थान!#मेला_होबे pic.twitter.com/rGxMYUyvsd





















