అన్వేషించండి

ఓ మై గాడ్.. మేడపై నుంచి దూకిన వ్యక్తిని గాల్లో ఉండగానే క్యాచ్ పట్టుకున్నారు, ఎలాగంటే..

అగ్నిమాపక సిబ్బంది ఓ వ్యక్తిని గాల్లో ఉండగానే క్యాచ్ పట్టుకున్నారు. అదెలాగో ఈ వీడియోలో చూడండి.

పైనా కాదు.. నేల మీద కాదు.. గాల్లో ఉండగానే అగ్నిమాపక సిబ్బంది ఓ వ్యక్తిని క్యాచ్ పట్టుకున్నారు. వామ్మో.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అలా కేవలం సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లేదా ఐరన్ మాత్రమే మాత్రమే చేయగలడు అని అనుకుంటున్నారా? అయితే, ఈ వీడియోలోని రియల్ సూపర్ మ్యాన్‌ను చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ, అతడు మాట వినలేదు. ఈ నేపథ్యంలో ఓ ఫైర్ ఫైటర్‌కు మరో ఐడియా వచ్చింది. అతడు మేడ మీద నుంచి దూకగానే గాల్లోనే అతడిని పట్టేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో అతడు ఎక్కిన అపార్ట్‌మెంట్‌లోని కిటికీ కిందకు వెళ్లి వేచి చూశారు. 

ఆ వ్యక్తి మేడ మీద నుంచి దూకగానే ఫైర్ ఫైటర్ కిటికీ నుంచి చేతులు బయటకు చాచి.. గాల్లో ఉండగానే క్యాచ్ పట్టేశాడు. వెంటనే ఆ వ్యక్తిని కిటికీ నుంచి లోపలికి లాగి ప్రాణాలు రక్షించారు. ఇందులో ఏ చిన్న పొరపాటు చేసినా ఆ ఫైర్ ఫైటర్ కూడా కిందపడిపోయేవాడు. కానీ, ఎంతో తెలివిగా అతడు.. ఆ వ్యక్తి కాళ్లను పట్టుకోగలిగాడు. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ అతడిని కాపాడాడు. రెడిట్, ట్విట్టర్‌లలో ఈ వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే అతడు హీరో అయిపోయాడు. 

Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

ఈ వీడియో చూసిన నెటిజనులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి క్యాచ్‌ను ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. మనిషిని క్యాచ్ పట్టడమంటే సాధారణ విషయం కాదని, ఆ సమయంలో చేతులపై చాలా భారం పడుతుందని అంటున్నారు. తప్పకుండా ఆ ఫైర్‌ఫైటర్ చేతి కండరాలు పట్టేసి ఉంటాయని, అంతర్గత గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లలో తెలుపుతున్నారు. అయితే, ఈ ఘటన ఎప్పుడు.. ఎక్కడ చోటుచేసుకుందనేది తెలియరాలేదు. ఆ వీడియోను చూస్తే తప్పకుండా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 

వీడియో:

Also Read: 335 మందితో డేటింగ్.. స్ఫూర్తి నింపుతున్న యువకుడి డేరింగ్ స్టెప్, మరో 30 మందిని కలిస్తే..

Also Read: రమణ్ కాదు రాక్షసుడు.. 41 మందిని చంపాడు, చివరికి కోడి కూర తిని..

Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
కదిరి సీఐ బెదిరిస్తున్నాడని మంగళగిరిలో ఫ్లెక్సీ పరంజ ఎక్కిన వ్యక్తి!
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
Bihar News In Telugu: అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య!
అంత్యక్రియలకు డబ్బుల్లేక మూడు రోజులు భర్త మృతదేహం పక్కనే కూర్చున్న భార్య!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget