News
News
X

Drugs On Cruise Ship Case: బెయిల్ దొరికినా ఆర్యన్‌కు తప్పని చిక్కులు.. ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ సమన్లు

డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ ఖాన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది.

FOLLOW US: 

ముంబయి డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది ఎన్‌సీబీ ప్రత్యేక దర్యాప్తు బృందం. డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ను ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో అక్టోబర్ 3న జరిగిన రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఇందులో ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 22 రోజులు ఆర్యన్ జైలులో ఉన్నాడు.

ఆర్యన్‌తో పాటు..

ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ సేత్ మర్చెంట్, అచిత్ కుమార్‌కు కూడా ఎన్‌సీబీ సమన్లు జారీ చేసింది. వారి వాంగ్మూలాలను అధికారులు రికార్డ్ చేశారు. ముంబయి వచ్చిన ప్రత్యేక బృందం వీరిని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు నుంచి సమీర్ వాంఖడేను తొలిగించి ఆ బాధ్యతలను సంజయ్ కుమార్ సింగ్‌కు అప్పజెప్పింది ఎన్‌సీబీ. కొత్త బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగానే నేడు సమన్లు జారీ చేసింది.

బెయిల్ కండీషన్లు..

డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్ ఇచ్చినప్పటికీ దర్యాప్తు కోసం ఎప్పడూ పిలిచినా వెళ్లాలని కోర్టు తెలిపింది.

ఇవే షరతులు.. 

 • 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్‌ రూ.లక్ష వ్యక్తిగత బాండ్ చెల్లించాలి.
 • ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలి.
 • ఎన్‌డీపీఎస్ కోర్టు వద్ద పాస్‌పోర్టును సరెండర్ చేయాలి.
 • గ్రేటర్ ముంబయి దాటి వెళ్లాలంటే దర్యాప్తు అధికారికి తెలపాలి. ఎక్కడికి వెళ్తున్నారో వివరాలను కూడా తెలియజేయాలి.
 • ముంబయిలోని ఎన్‌డీపీఎస్ ప్రత్యేక కోర్టు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లకూడదు.
 • ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎవరితోనూ మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు.
 • ఈ కేసులో సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయకూడదు.
 • ఈ కేసు గురించిన వివరాలు మీడియాకు చెప్పకూడదు.
 • ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య హాజరు కావాలి.
 • ఎన్‌సీబీ అధికారులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలి.

Also Read: Chennai Flood Alert: జలదిగ్బంధంలో చెన్నై.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

Also Read: Nadda on BJP: ఇక భాజపా కథ వేరుంటది.. బంగాల్‌ రాజకీయంపై నడ్డా కీలక వ్యాఖ్యలు

Also Read: Aryan Khan Drugs Case: 'ఆర్యన్ ఖాన్‌ను కిడ్నాప్ చేశారు.. షారుక్ ఇప్పటికైనా నోరు విప్పు'

Also Read: Chennai Rain: భారీ వర్షాలకు చెన్నై గజగజ.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎమ్‌డీ

Also Read: Hidden Camera: స్కూల్ బాత్రూంలో సీసీ కెమెరాలు.. షాకైన అధికారులు.. రిజిస్ట్రేషన్ రద్దు!

Also read: వినువీధిలో అద్భుతం, వందేళ్లలో అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం... చూసే అదృష్టం ఈ దేశాల వారిదే

Also read: మైదాపిండి ఎలా తయారుచేస్తారో తెలుసా? దానిలో వాడే రసాయనాలు ఇవే... తింటే ప్రమాదమే

Also read: తొలిసారి కరోనాకు చెక్ పెట్టేందుకు టాబ్లెట్... బ్రిటన్ ఆమోదం

Also read:ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Nov 2021 08:21 PM (IST) Tags: Drugs Case NCB aryan khan Mumbai Rave Party Case Rave Party Case Drugs On Cruise Case NCB SIT

సంబంధిత కథనాలు

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

SSC CPO Notification 2022 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 4300 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Vangalapudi Anitha : గోరంట్ల మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయాలి, ఎన్సీడబ్ల్యూకు అనిత లేఖ

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

Breaking News Live Telugu Updates: ఆగస్టు 15 నుంచి తెలంగాణలో పింఛన్ల జాతర- మరో పది లక్షలకు క్యాబినెట్ ఆమోదం

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

What's App Calls Cheating : అందమైన అమ్మాయి వాట్సప్ వీడియో కాల్ చేస్తే, మీకు చిక్కులే!

టాప్ స్టోరీస్

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్‌‌స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌‌తో మెగా హీరో నిశ్చితార్థం!

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?

టార్గెట్‌ లోకేష్ వ్యూహంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తుందా?