Viral Video: అక్కడ ఒక్క డ్రెస్ పీసే ఉంది - కానీ ఇద్దరికి నచ్చింది - ఎవరికి దక్కాలో ఎలా తేల్చుకున్నారో తెలుసా ? వీడియో
Delhi: మహిళలు షాపింగ్ లో అసలు రాజీ పడరు. ఎంతగా అంటే నడి రోడ్డుపై ఫైటింగ్ కు అయినా రెడీ అంటారు. ఈ ఢిల్లీ మహిళలు అదే చేశారు.

Delhi Viral Video: మహిళలు షాపింగ్ ను ఆస్వాదిస్తారు. అది మాల్ లో అయినా స్ట్రీట్ షాపింగ్ అయినా పెద్దగా తేడా ఉండదు. నచ్చిన వస్తువు.. నచ్చిన డ్రెస్ కనిపిస్తే వదిలి పెట్టరు. కొన్ని కొన్ని సార్లు ఈ షాపింగ్ ఉద్రిక్తలకు దారి తీస్తుంది. అయితే భర్త గొడవపడటమో.. మరొకటో కాదు.. మరో మహిళా షాపర్ తోనే గొడవులు అవుతాయి. అవి చినికి చినికి గాలివానగా మారుతాయి.
ఇలాంటి ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో సరోజినిదేవి మార్కెట్ విండో షాపింగ్ కు పెట్టింది పేరు. చాలా మంది వస్తూంటారు. ఇలా ఓ షాపు దగ్గర కొంత మంది మహిళలు షాపింగ్ చేయడం ప్రారంభించారు. అక్కడ ఓ డ్రెస్ చూసిన ఓ మహిళ.. ఇది తనకు బాగా నచ్చిందని ఫ్యాక్ చేయమని షాప్ బాయ్ ను అడిగింది. అయితే వెంటనే మరో మహిళ వచ్చి సారీ చెప్పింది. తాను అప్పటికే దాన్ని కొనేసుకున్నానని బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అని చెప్పింది.
दिल्ली की सरोजनी नगर मार्किट में कपड़े की ख़रीद को लेकर, महिलाओं के बीच हों गई लड़ाई एक दूसरे के बाल खीचे
— Lavely Bakshi (@lavelybakshi) April 8, 2025
विडिओ सोशल मीडिया पर वायरल हुआ pic.twitter.com/dBadYlHS56
కానీ కొనేసుకుంటే.. కౌంటర్ దగ్గర బిల్లింగ్ వేయించుకోవాలికానీ.. ఇలా ఇంకా ర్యాక్ లోనే ఎందుకు ఉంటుందని.. అక్కడ ఉంది కాబట్టి తానే ముందు కొన్నానని స్పష్టం చేసింది. ఇద్దరూ ఎవరి వాదనలో వారు తగ్గలేదు. దుకాణం యజమాని కూడా అలాంటిదే ఇంకోటి ఉందని గొడవ పడొద్దని సర్తి చెప్పలేకపోయారు. ఎందుకంటే.. రెండో పీస్ లేదు. నిజంగా రెండో పీస్ ఉంటే.. ఆ ఇద్దరూ ఆ డ్రెస్ కొనేవారు కాదని కొంత మంది సెటైర్లు కూడా వేశారు. ఒక్కటే ఉంది కాబట్టి దాని కోసం పోటీ పడ్డారు.
వీరిద్దరి గొడవ మాటలతో ప్రారంభమై ఫైటింగ్ కు దారి తీసింది. ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. మహిళలు ఇలా యుద్ధం చేసుకుంటూంటే తాము మధ్యలో ఎందుకు రావాలని ఇతరులు పట్టించుకోలేదు. కానీ ఖాళీగా ఉండలేదు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఆ మహిళలు ఫేమస్ అయిపోయారు.
दिल्ली की #सरोजनी नगर मार्किट में कपड़े की ख़रीद को लेकर, महिलाओं में हों गई लड़ाई एक दूसरे के बाल खीचे
— Deep Khabar (@kawalde17064581) April 9, 2025
विडिओ तेजी से सोशल मीडिया पर वायरल हुआ। pic.twitter.com/dMnlxdaKSZ
అలసిపోయే వరకూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. చుట్టుపక్కల వారందరూ వచ్చి విడదీశారు. ఒకరినొకరు హెచ్చరించకుంటూ వెళ్లిపోయారు. కానీ ఆ డ్రెస్ ను మాత్రం ఎవరూ కొనలేదు. షాపింగ్ లో అసలు ట్విస్టులు అలాగే ఉంటాయి.





















