News
News
X

CTET 2022: సీటెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)-2022 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసింది.

FOLLOW US: 
 

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (సీటెట్)-2022 నోటిఫికేషన్‌‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) అక్టోబరు 20న విడుదల చేసింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నవారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవడం కోసం ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. అక్టోబరు 31 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫీజు చెల్లించడానికి నవంబరు 25 వరకు అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500), రెండు పేపర్లకు అయితే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాల్సి ఉంటుంది. సీటెట్‌ ఆన్‌లైన్‌ టెస్టును డిసెంబర్‌, వచ్చే ఏడాది జనవరి మధ్య నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ఈమేరకు ప్రకటించింది.

వివరాలు..

✪ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబరు -2022

✦ ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)

అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

✦ ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)


అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 రూ.1000 చెల్లించాలి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకునేవారు రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పేపర్-1 లేదా పేపర్-2 కు రూ.500; రెండు పేపర్లకు అయితే రూ.600 చెల్లించాలి.

ఎంపిక విధానం:
రాతపరీక్ష ద్వారా.

పరీక్ష విధానం..


✦ పేపర్-1:
ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

✦ పేపర్-2:
ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.

ముఖ్యమైన తేదీలు...

సీటెట్ డిసెంబరు 2022 నోటిఫికేషన్ వెల్లడి: 20.10.2022.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.10.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.11.2022.
ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.11.2022.
పరీక్ష తేదీ: డిసెంబరు 2022 - జవవరి 2023 మధ్య.

News ReelsPublic Notice

Website

:: ఇవీ చదవండి ::

 

ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1422 ఉద్యోగాలు, పూర్తి వివరాలివే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్ సర్కిల్‌లో 176 ఖాళీలున్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

ఏపీలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15 నుండి ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Published at : 21 Oct 2022 08:44 AM (IST) Tags: CBSE CTET Central Teacher Eligibility Test Central Board of Secondary Education CTET examination 2022 CTET Dec 2022 CTET 2022 notification released CTET 2022 application registration CTET 2022 application from Oct 31 CTET 2022 application

సంబంధిత కథనాలు

Midnapore Bomb Blast: తృణమూల్ నేత ఇంట్లో నాటు బాంబు పేలుడు, ఇద్దరు మృతి

Midnapore Bomb Blast: తృణమూల్ నేత ఇంట్లో నాటు బాంబు పేలుడు, ఇద్దరు మృతి

కన్న ప్రేమను కమ్మేసిన కరోనా - డబ్బు కోసం కన్నబిడ్డలతో పాడు వీడియోలు చేయించిన తల్లి

కన్న ప్రేమను కమ్మేసిన కరోనా - డబ్బు కోసం కన్నబిడ్డలతో పాడు వీడియోలు చేయించిన తల్లి

Hyderabad Crime News: హెచ్సీయూలో ఉద్రిక్తత- కీచక ప్రొఫెసర్‌ అరెస్టుకు విద్యార్థుల డిమాండ్

Hyderabad Crime News: హెచ్సీయూలో ఉద్రిక్తత- కీచక ప్రొఫెసర్‌ అరెస్టుకు విద్యార్థుల డిమాండ్

Adani Group Companies: 2022లో అదానీ స్టాక్సే తోపులు - ఆయన్ను ప్రపంచ కుబేరుడిగా మార్చిన సీక్రెట్‌ ఇదే!

Adani Group Companies: 2022లో అదానీ స్టాక్సే తోపులు - ఆయన్ను ప్రపంచ కుబేరుడిగా మార్చిన సీక్రెట్‌ ఇదే!

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

AP Staff Nurse Posts: స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ- దరఖాస్తు చేసుకోండిలా!

టాప్ స్టోరీస్

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

TSLPRB Police Physical Events: పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు! వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

TSLPRB Police Physical Events:  పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు!   వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!