Exim Bank: ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు, జీతమెంతో తెలుసా?
ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్) మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 14న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 45
1) మేనేజర్ (లా): 02 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ(లా). అడ్వొకేట్‌గా ఎన్‌రోల్‌మెంట్ అయి ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) మేనేజర్ (ఐటీ): 02 పోస్టులు
అర్హత: 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. సంబంధిత కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి.
3) మేనేజ్‌మెంట్ ట్రైనీ: 41 పోస్టులు
అర్హత: ఎంబీఏ/పీజీడీబీఏ/సీఏ ఉత్తీర్ణత ఉండాలి.
అనుభవం: అవసరంలేదు.
వయోపరిమితి: 01.11.2022 నాటికి మేనేజర్ పోస్టులకు గరిష్ట వయసు ఎస్సీ, ఎస్టీకు 40 సంవత్సరాలు; ఓబీసీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మేనేజ్‌మెంట్ పోస్టులకు 21 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
రాతపరీక్ష విధానం: మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలోనూ, 100 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలోనూ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 150 నిమిషాలు.
జీతభత్యాలు:
* మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.55,000 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. తర్వాత వీరికి డిప్యూటీ మేనేజర్ హోదాలో ఏడాదికి 17 లక్షల వార్షిక వేతనం ఉంటుంది.
* మేజేజర్ పోస్టులకు రూ.48,170 -1740 – 49910 -1990 - 69,810 స్థాయిలో వేతనం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 04-11-2022.
* ఆన్‌లైన్ పరీక్ష తేదీలు: నవంబర్/డిసెంబర్ 2022.
* ఇంటర్వ్యూ తేదీ: జనవరి/ఫిబ్రవరి 2023.
Notification
Online Application
Also Read
సీడాక్‌లో 530 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో 349 మేనేజ్‌మెంట్ పోస్టులు, అర్హతలివే!
దేశంలోని ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో వివిధ ఖాళీల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ASRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐదేళ్ల కాలపరిమితితో నాన్- రిసెర్చ్ మేనేజ్ మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.50 వేల జీతం!
ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబరు 28లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...