CDAC: సీడాక్‌లో 530 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు, ఈ అర్హతలుంటే చాలు
ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పుణెలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 20లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 530 పోస్టులు
1) ప్రాజెక్ట్ అసోసియేట్: 30 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 30 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.3.6 లక్షలు - రూ.5.04 లక్షలు చెల్లిస్తారు.
2) ప్రాజెక్ట్ ఇంజినీర్: 250 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.4.49లక్షలు - రూ.7.11 లక్షలు చెల్లిస్తారు.
3) ప్రాజెక్ట్ మేనేజర్: 50 పోస్టులు
అర్హత: ప్రాజెక్ట్; అసోసియేట్;: సంబంధిత స్పెషలైజేషన్;లో బీఈ/ బీటెక్;/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్;/ పీహెచ్;డీ ఉత్తీర్ణత.
వయసు: 56 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9 లక్షలు చెల్లిస్తారు.
4) సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 200 పోస్టులు
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/పీజీ/ఎంఈ/ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 56 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతభత్యాలు: ఏడాదికి రూ.8.49 లక్షలు - రూ.14 లక్షలు చెల్లిస్తారు.
విభాగాలు: హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ & క్లౌడ్ కంప్యూటింగ్, మల్టీలింగ్వల్ కంప్యూటింగ్ & హెరిటేజ్ కంప్యూటింగ్, ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఈ & ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ (FOSS), సైబర్ సెక్యూరిటీ & సైబర్ ఫోరెన్సిక్స్, హెల్త్ ఇన్‌ఫర్మాటిక్స్, ఎడ్యుకేషన్ & ట్రైనింగ్, ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ & ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ & లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింక్, డిపెండబుల్ & సెక్యూర్ కంప్యూటింట్ మిషన్, జెన్‌నెక్ట్స్ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.10.2022.
* దరఖాస్తు చివరి తేది: 20.10.2022.
* ఇంటర్వ్యూ తేదీ: ప్రకటించాల్సి ఉంది.
NOTIFICATION & ONLINE APPLICATION
ఇవీ చదవండి..
సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్య్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..