Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!
బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్య్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 346
పోస్టుల కేటాయింపు: జనరల్-146, ఈడబ్ల్యూఎస్-33, ఓబీసీ-92, ఎస్సీ-50, ఎస్టీ-25.
1) సీనియర్ రిలేషనల్‌షిప్ మేనేజర్లు: 320
అర్హత: ఏదైనా డిగ్రీ. రెండేళ్ల పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్‌మెంట్) ఉండాలి. NISM/IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 24 - 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
2) ఈ వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: 24
అర్హత: ఏదైనా డిగ్రీ. రెండేళ్ల పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్‌మెంట్) ఉండాలి. NISM/IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం ఏడాదిన్నర పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 23 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
3) గ్రూప్ సేల్స్ హెడ్: 01
అర్హత: ఏదైనా డిగ్రీ. రెండేళ్ల పీజీ డిగ్రీ/డిప్లొమా(మేనేజ్‌మెంట్) ఉండాలి.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 31 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
4) ఆపరేషన్స్ హెడ్-వెల్త్: 01
అర్హత: ఏదైనా డిగ్రీ.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2022 నాటికి 35 - 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోసడలింపు: నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేటగిరీలవారీగా 5-10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారు కాంట్రాక్ట్ వ్యవధి ప్రకారం విధిగా 5 సంవత్సరాలపాటు పనిచేయాల్సి ఉంటుంది. సంస్థ అవసరాలకు అనుగుణంగా సేవలను పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు...
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 20.10.2022.
నోటిఫికేషన్
ఆన్‌లైన్ అప్లికేషన్
వెబ్‌సైట్
ఇవీ చదవండి..
సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...