YSRCP Youth Wing: వైసీపీ యువజన విభాగం కమిటీ నియామకం, మరోసారి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఛాన్స్
Byreddy Siddharth Reddy : వైఎస్సార్ సీపీ యువజన విభాగం నూతన కమిటీలను ప్రకటించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.
![YSRCP Youth Wing: వైసీపీ యువజన విభాగం కమిటీ నియామకం, మరోసారి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఛాన్స్ Byreddy Siddharth Reddy named YSRCP youth wing president again YSRCP Youth Wing: వైసీపీ యువజన విభాగం కమిటీ నియామకం, మరోసారి బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/12/660781b8fca8c409f272abfcaed2534c1702400950810233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP News: అమరావతి: వైఎస్సార్ సీపీ యువజన విభాగం నూతన కమిటీలను ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కమిటీలను నియమించారు. అన్ని జిల్లాలకు సంబంధించి కమిటీ జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. నంద్యాల జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నానికి చెందిన కొండా రాజీవ్ గాంధీతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన పిన్నెల్లి వెంకట్రామి రెడ్డి, అన్నమయ్య జిల్లాకు చెందిన తప్పెట సాహిత్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
8 మంది జోనల్ ఇన్ ఛార్జీలు, ముగ్గురు అధికార ప్రతినిధులను నియమించారు. 5 మందిని జనరల్ సెక్రటరీలుగా, 25 మంది సెక్రటరీలు, 18 మందికి జాయింట్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇదివరకే 11 నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలను మార్చగా.. తాజాగా వైసీపీ యువజన విభాగం కమిటీలను ప్రకటించారు.
వైఎస్సార్ సీపీ యువజన విభాగం నూతన కమిటీలను ప్రకటించారు.పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కమిటీలను నియమించారు.అన్ని జిల్లాలకు సంబందించి కమిటీ జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.#YSRCP pic.twitter.com/HEZATyLuwW
— YSR Congress Party (@YSRCParty) December 12, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)