Bengaluru Airport: తప్పిన పెను ప్రమాదం.. ఎదురెదురుగా ఢీ కొట్టబోయిన రెండు ఇండిగో విమానాలు!

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు ఇండిగో విమానాలు ఢీ కొట్టబోయాయి. అయితే చివరి నిమిషంలో పెను ప్రమాదం తప్పింది.

FOLLOW US: 

బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (KIA) పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు ఢీ కొట్టబోయి త్రుటిలో తప్పించుకున్నాయని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. జనవరి 7న ఈ ఘటన జరిగినట్లు తెలిపింది. 

ఏం జరిగింది?

జనవరి 7న రెండు ఇండిగో విమానాలు ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. 6E 455 విమానం కోల్‌కతా వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. 6E 246 భూవనేశ్వర్‌ వెళ్లేందుకు రెడీ అయింది. రెండింటికి ఒకే సమయంలో టేకాఫ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు అధికారులు.

అదేంటి?

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తర, దక్షిణ.. రెండు రన్‌వేలు ఉన్నాయి. కానీ ఒకే సమయంలో రెండు రన్‌వేలు వినియోగించడం లేదు. అలా చేస్తే ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని ఒక రన్‌వేపై విమానం బయలుదేరినప్పుడు మరో రన్‌వేపై ఉన్న ఫ్లైట్‌కు టేకాఫ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వరు.

కానీ ఈ ఘటన జరిగిన రోజు.. ఉత్తర దిశ వైపు ఉన్న రన్‌వేను డిపార్చర్ అయ్యే విమానాల కోసం, దక్షిణ వైపు ఉన్న రన్‌వేను వచ్చే విమానాల కోసం వినియోగించారు. ఆ తర్వాత దక్షిణ రన్‌వేను మూసివేయాలని  షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ విషయాన్ని సౌత్‌ టవర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పలేదు. దీని వల్ల రెండు రన్‌వేలపై ఉన్న విమానాలకు ఒకేసారి టేకాఫ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు.

తప్పిన ప్రమాదం..

రెండు విమానాలు ఒకే డైరెక్షన్‌లో బయలుదేరాయి. ఆల్‌మోస్ట్ రెండు విమానాలు ఢీ కొట్టే పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయాన్ని గమనించిన రాడార్ కంట్రోలర్.. వెంటనే పైలెట్‌ను అలర్ట్ చేయడంతో ముప్పు తప్పింది.

ఈ ఘటనపై డీజీసీఏ తీవ్ర ఆగ్రవహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ ఆదేశించారు. ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇండిగో సంస్థ ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించింది.

Also Read: Aparna Yadav BJP: ములాయం సింగ్ దీవెనలతోనే భాజపాలో చేరాను: ABPతో అపర్ణా యాదవ్

Also Read: Aparna Yadav Joins BJP: అనుకున్నట్లే అయింది.. భాజపాలోకి ములాయం చిన్నకోడలు.. సమాజ్‌వాదీలో గుబులు!

Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 07:39 PM (IST) Tags: Kolkata bhubaneswar dgca Indigo Airlines Directorate General of Civil Aviation Kempegowda International airport Mid-air collision

సంబంధిత కథనాలు

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: ఏపీలో ప్రతీ ఇంటా వెంకాయ‌మ్మ మాటే వినిపిస్తోంది : సీఎం జగన్‌కు నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరేనా ? ఖరారు చేసిన సీఎం జగన్! ఈయనకి మళ్లీ ఛాన్స్

Court Fine For CBI Ex Chief : ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం కోర్టుకెళ్తే రూ. పదివేల జరిమానా పడింది - రిటైర్డ్ తెలుగు ఐపీఎస్‌కు ఎంత కష్టమో !?

Court Fine For CBI Ex Chief :   ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం కోర్టుకెళ్తే రూ. పదివేల జరిమానా పడింది - రిటైర్డ్ తెలుగు ఐపీఎస్‌కు ఎంత కష్టమో !?

World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు

World Hypertension Day సర్వే ఫలితాలు ఆశ్చర్యం, బాధను కల్గించాయ్, 45 ఏళ్లు దాటితే బీపీ, షుగర్ టెస్టులు తప్పనిసరి: హరీష్ రావు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్‌ డీల్‌కు మస్కా కొట్టాడుగా!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

Nabha Natesh Photos: కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి