Pakistan Beggars: పాకిస్తాన్‌లో నెంబర్ వన్ ఉద్యోగం అడుక్కోవడమట - లక్షల్లో బిచ్చగాళ్లు - ఇలా అయిపోతోందంటి ?
Pakistan: పాకిస్తాన్‌లో హాట్ జాబ్ ఏదంటే… బిచ్చగాడిగా మారడం అని అక్కడి యువత సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఉద్యోగం చేసినా వచ్చే దాని కంటే ఎక్కువ బిచ్చగాళ్లు సంపాదిస్తున్నారట.
Beggars earn huge amount in Pakistan: పాకిస్తాన్‌లో ఓ బిచ్చగాడి ఫ్యామిలీ తమ కుటుంబంలో ఓ వృద్ధురాలు చనిపోయిన కారణంగా కోటి రూపాయలు ఖర్చుపెట్టి భారీ కార్యక్రమం చేశారని మీడియాలో వైరల్ అయింది. పాకిస్తాన్ లో బిచ్చగాళ్లు ఇలా ధూం..ధాంగా కుటుంబ వేడుకలు చేసుకోవడం సహజమేనని తాజాగా వెలుగులోకి వస్తున్న వార్తలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ లో బిచ్చగాళ్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. లక్షల మంది చిన్నచిన్న ఊళ్లలోకూడా బిచ్చమెత్తి బతికేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిపై అక్కడి మీడియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ కథనాలు రాస్తోంది.
రోజుకు వేలకు వేలు సంపాదిస్తున్న పాకిస్తాన్ బిచ్చగాళ్లు
కరాచీలో ఒక బిచ్చగాడు రోజుకు సగటున రూ.2000 సంపాదిస్తాడు. లాహోర్‌లో ఈ మొత్తం రూ.1400, ఇస్లామాబాద్‌లో రూ.950. దేశవ్యాప్తంగా యాచకులు సగటున రోజుకు రూ.850 సంపాదిస్తున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం గుర్తించింది. అన్ని ప్రాంతాల్లో కలిపి పాకిస్తాన్‌లోని బిచ్చగాళ్ళు ప్రతిరోజూ మూడున్నర కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ మొత్తం సంవత్సరానికి 117 ట్రిలియన్ రూపాయలు లేదా 42 బిలియన్ డాలర్లకు సమానం. ఇంత భారీ మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడి ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
వారి వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని పాకిస్తాన్ ఆర్థిక వేత్తల ఆందోళన
బిచ్చగాళ్ళు ఉత్పాదకత లేని వ్యక్తులే కాదు, వారు 42 బిలియన్ డాలర్లను ఉపయోగించడం ద్వారా సమాజంపై భారం కూడా వేస్తారు. వారి కార్యకలాపాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని 21 శాతం పెంచే ప్రమాదం ఉందని అంచనా వేశారు. బిచ్చగాళ్లు ఏ ఉత్పాదకత వచ్చే పని చేయడం లేదు. కానీ ఇలా ఉచితంగా డబ్బులు అడుక్కుని వాటిని ఉత్పాదక వస్తువుల మీద ఖర్చుపెడుతున్నారు. భిక్షాటన ద్వారా సేకరించిన మొత్తం వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగిస్తారన.ి. ఈ మొత్తం దేశ ఉత్పత్తిని పెంచదని గుర్తుచేస్తున్నారు. డబ్బు యాచించడం వల్ల దేశంలో డిమాండ్ మరియు , పెరుగుతాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందని అంటున్నారు.
Also Read : Sriram Krishnan: ట్రంప్ కొత్త AI సలహాదారుగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తి, ఇంతకీ ఎవరీయన
వారికి ఉపాధి చూపించాలన్న వాదనలు - బిచ్చగాళ్లుగా మారుతున్న నిరుద్యోగులు
ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. యాచకులకు ఉపాధి కల్పించడం ద్వారా వారిని సమాజంలో ఉపయోగకరమైన సభ్యులుగా తీర్చిదిద్దవచ్చుననిస సలహాలు ఇస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వానికి ఇలాంటివాటిపై ఆలోచించే తీరిక ఉండదు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండటంతో ఇక బిచ్చగాళ్ల మాదిరి కెరీర్ ప్రారంభించుకోవడం మంచిదని కొంతమంది పాకిస్తాన్ యువత సెటైర్లు వేసుకుంటున్నారు.