వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
జగన్ వెంటే నడుస్తానంటూ కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేసిన కార్పొరేటర్
నెల్లూరు రూరల్ లో ఆధిపత్య పోరు మొదలైంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి వెంటే అందరు కార్పొరేటర్లు ఉంటారనుకుంటే సడన్ గా ఆ లెక్కలు మారాయి. జై జగన్, జై ఆదాల అంటూ కొందరు తిరుగుబాటు స్వరం వినిపించారు. దీంతో కోటంరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. తన మాట విననంటున్న కార్పొరేటర్ల ఇంటికెళ్లి రాయబారం నడిపించాలనుకున్నారు. కానీ వాళ్లు తిరగబడ్డారు. తమని బెదిరిస్తున్నారంటూ ఏకంగా ఓ కార్పొరేటర్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఉదయం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫ్లెక్సీలు చించేశారు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి. తాను జగన్ వెంట నడుస్తానని ఎంపీ ఆదాలకు మద్దతు పలికారు. దీంతో కోటంరెడ్డి మధ్యాహ్నం తన ఇంటికొచ్చారని, తనపై సీరియస్ అయ్యారని చెబుతున్నారు. తనకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించింది కోటంరెడ్డే అయినా, తాను జగన్ పార్టీపై గెలిచానని, ఆయనతోనే ఉంటానన్నారు. పోలీసులు ఈ వ్యవహారం పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామన్నారు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి
వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం పర్వతగిరి మండలం సొమారం గ్రామం వద్ద వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను BRS కార్యకర్తలు చింపివేశారు. మంత్రి కాన్వాయ్ లో వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు చింపేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మమ్మల్ని ఎదుర్కోలేక మంత్రి ఎర్రబెల్లి చిల్లర పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం పూర్తి చేసి సాగు విస్తీర్ణం పెంచాం: గవర్నర్
కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టి ని ఆకర్షించామన్నారు. దీని ఫలితంగానే సాగు ఇరవై లక్షల ఎకరాల నుంచి 73. 33 లక్షల ఎకరాలకు పెరిగింది. త్వరలో కోటి ఎకరాలకు పేగా సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రశంసలు దక్కాయి. రైతులకు 65వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించాం. రైతుకు ఐదు లక్షల విలువైన జీవిత బీమా అందిస్తున్నాం. - తెలంగాణ గవర్నర్
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ తమిళి సై ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సమావేశాల్లో ఆమె ప్రసంగిచడం ఇది రెండో సారి. తెలంగాణ అభివృద్ధికి దేశానికి మోడల్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తుందన్నారు. సీఎం, ప్రజాప్రతినిధుల కృషితోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణలో ఎన్నో విజయాలు సాధించాం. సంక్షేమ, అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా ఉన్నామన్నారు.
నేను చేసింది నమ్మకద్రోహం అయితే నువ్వు చేసిందేంటీ? అనిల్‌ను ప్రశ్నించిన కోటంరెడ్డి
మాజీ మంత్రి అనీల్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై ఆడియోలు వీడియోలు విడుదల చేయాలని సలహా ఇచ్చారు. తనను అరెస్టు చేస్తామంటూ చాలా మంది మీడియాకు లీకులు ఇస్తున్నారని... దమ్ముంటే అరెస్టు చేసుకోవాలని సవాల్ చేశారు. కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అరెస్టులు అయ్యారని... అప్పుడు కనిపించని సజ్జల భార్గవ్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాకు ఇన్‌ఛార్జ్ ఎలా అయ్యారని అన్నారు. తనను నమ్మకద్రోహి అంటున్న అనిల్ కుమార్ ఆనం ఫ్యామిలీకి చేసిందేంటని ప్రశ్నించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

