News
News
X

K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

తెలుగు సినీరంగానికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూశారు.

FOLLOW US: 
Share:

K. Viswanath:  ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరిన కె.విశ్వనాథ్.. ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్‌ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్‌ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ వరకూ విశ్వనాథ్‌  51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో  సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి , సప్తపది సహా ప్రతి సినిమా ఆణిముత్యమే. ఆయన సినిమాలన్నీ సంగీత ప్రధానంగా సాగడం విశేషం. ముఖ్యంగా ప్రేమను వ్యక్తపరచడంలో కూడా ఆయన ఎంచుకున్న మార్గం సంగీతం, భక్తి ప్రధానమే. ఇందుకు మంచి ఉదారహణ సప్తపది సినిమాలో త్యాగరాయ కీర్తన ద్వారా తన ప్రేమను, అందులో తన్మయత్వాన్ని, ఎదురుచూపును తెలియజేస్తుంది నాయకి. 

సప్తపది సినిమాలో పాట

సప్తపది సినిమాలో హీరోయిన్ తన ప్రేమికుడి కోసం ఎదురుచూస్తూ ఈ కీర్తన పాడుతుంది. సాధారణ సినిమాల్లో చూపించినట్టు తన ప్రేమికుడితో కలసి డ్యూయెట్ కాదు..తన ఊహల్లో తేలిపోవడం కాదు..భక్తితో శ్రద్ధగా దైవ సన్నిధిలో పూజచేస్తూ మరుగేలరా ఓ రాఘవ అని ఓ వైపు దేవుడిని స్తుతిస్తూ..మరోవైపు నీపై ఉన్న ప్రేమకూడా ఇందుకు సమానం అని అర్థంవచ్చేలా..తనకు అర్థమయ్యేలా వివరిస్తుంది. భక్తితో హుందాగా ప్రేమను వెల్లడించేలా చేయడం కళాతపస్వి విశ్వనాథ్ కే చెల్లింది. 

త్యాగరాయ కృతి సందర్భం ఇది

త్యాగరాజు నిత్యం భక్తిలో మునిగితేలడం చూసి సోదరుడు...ఇక కుమార్తెకు ఈ పేద భక్తుడు ఎలా పెళ్లిచేస్తాడో అనుకుంటాడు. ఇంతలో కేరళ నుంచి అత్యంత ధనవంతుడు వచ్చి స్వామివారు కలలో కనిపించారని చెప్పి త్యాగరాయ కుమార్తెకు పెళ్లిచేస్తాడు. అది చూసి సోదరుడు కుళ్లుకుంటాడు. నిత్యం పేదభక్తుడు పెట్టినవి తిన్నావు..ఈ రోజైనా కడుపునిండా ఆరగించు అని పెళ్లివిందులో వంటకాలన్నీ నైవేద్యంగా సమర్పిస్తాడు. ఇదంతా చూసిన త్యాగరాయ సోదరుడు...ఈయన ఆనంద మొత్తం ఈ నాలుగు విగ్రహాల్లో (రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు)...ఉందని గమనించి ఆ విగ్రహాలను తీసుకెళ్లి కావేరీ నదిలో పడేస్తాడు. ఆ మర్నాడు నిద్రలేచి వెళ్లి దేవుడి మందిరం తెరిచి చూసేసరికి అక్కడ విగ్రహాలు కనిపించవు. దాంతో..ఆవేదన చెందుతాడు త్యాగరాజు. 40 రోజుల పాటూ తిండి, నిద్ర లేకుండా తిరుగుతాడు. ఆ సమయంలో ఆలపించిన కీర్తన ఇది...

'నా మీద నీ మరుగేమైంది..అన్నీ నీవనే కదా ఉన్నాను..నిన్ను మాత్రమే నమ్మాను అని..ఎందుకిలా చేశావు.. అయితే మనిషిని తీసుకెళ్లిపో..లేదంటే కనిపించు అని కన్నీళ్లతో వేడుకుంటాడు. అప్పుడు రాముడు కలలో కనిపించి..కావేరీ నదికి గతంలో ఇచ్చిన వరం ప్రకారం మండలం రోజులు ఆ నదిలో ఉన్నానని చెబుతాడు'.

అలా రాముడికోసం త్యాగరాయ పడిన తాపత్రయాన్ని...కళాతపస్వి విశ్వనాథ్..తన సినిమాలో నాయకి..నాయకుడి కోసం ఎదురుచూపులుగా చిత్రీకరించారు....

Also Read: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

Published at : 03 Feb 2023 07:27 AM (IST) Tags: K Viswanath Passed Away K Viswanath Death K Viswanath Celebs Tribute K Viswanath devotional songs K Viswanath bhakti

సంబంధిత కథనాలు

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: ఈ ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం అని ఎందుకంటారు!

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Sri Rama Navami 2023: శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి, నిత్యం చదువుకుంటే ఇంకా మంచిది

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

Astrology News: మీ రాశి ప్రకారం వివాహానికి, శుభకార్యాలకు మీకు కలిసొచ్చే తేదీలు, రంగులు

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

మార్చి 28 రాశిఫలాలు - ఈ రోజు ఈ రాశులవారి ఆదాయం, ఆనందం పెరుగుతుంది

పెళ్లికాని యువతులు సింధూరం పెట్టుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా? వివాహితులే ఎందుకు పెట్టుకోవాలి?

పెళ్లికాని యువతులు సింధూరం పెట్టుకుంటే ఆ కోరికలు పెరుగుతాయా? వివాహితులే ఎందుకు పెట్టుకోవాలి?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

PAN- Aadhaar Link: పాన్‌-ఆధార్‌ లింకేజీలో వీళ్లకు మినహాయింపు, మీరూ ఈ వర్గంలో ఉన్నారా?

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా