Anant Ambani Radhika Merchant Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్ ఫుడ్ మెనూ ఇదే, ఆ వంటకమే హైలైట్
Anant Ambani Radhika Merchant: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్‌కి వచ్చే అతిథులకు నోరూరించే వంటకాలు అందించనున్నారు. అందులో చాట్ డిషెస్ చాలా స్పెషల్‌గా నిలవనున్నాయి.
Anant Ambani Radhika Merchant Wedding Menu: జులై 12న అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ముంబయిలోని జియో కన్వెషన్ సెంటర్‌లో ఈ జంట ఒక్కటి కానుంది. జులై 14వ తేదీ వరకూ ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కళ్లు చెదిరేలా జరుగుతున్నాయి. పెళ్లిని ఇంతకి మించి పదింతలు ఘనంగా జరిపేందుకు అంబానీ ఫ్యామిలీ (Anant Ambani Radhika Merchant's wedding Food Menu) అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. వచ్చే అతిథులకు ఎక్కడా మర్యాదలో లోపం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా విందు విషయంలో మరింత శ్రద్ధ వహిస్తోంది. లైఫ్ అంతా గుర్తుండిపోయేలా రకరకాల రుచులను గెస్ట్‌లకు పరిచయం చేయనుంది. వారణాసిలో ఫేమస్ అయిన కాశీ ఛాట్‌బండార్ నుంచి పలు రకాల వంటకాల్ని తెప్పించనుంది. గత నెల నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం ముగించుకున్నాక కాశీ ఛాట్ బండార్‌కి వెళ్లి అక్కడి వంటకాల్ని రుచి చూశారు. ఈ టేస్ట్‌కి ఇంప్రెస్ అయిన నీతా అంబానీ వెంటనే ఆ షాప్ ఓనర్‌కి వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపారు. పెళ్లిలో స్పెషల్ స్టాల్ పెట్టాలని రిక్వెస్ట్ చేశారు. టిక్కీ, టొమాటో చాట్, పాలక్ చాట్ చనా కచోరీతో పాటు నోరూరించే కుల్ఫీ కూడా అతిథులకు సర్వ్ చేయనున్నారు. వీటితో పాటు మరి కొన్ని వంటకాలనూ మెనూలో చేర్చారు.
View this post on Instagram
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో 2,500 రకాల వంటలు
ప్రీవెడ్డింగ్ వేడుకలకు వచ్చిన అతిథులకు తమ ఆతిథ్యం ఎలా ఉంటుందో పరిచయం చేసింది అంబానీ కుటుంబం. ఈ వేడుకల్లో దాదాపు 2,500 రకాల వంటకాలు చేయించింది. ఫ్రెంచ్, సింగపూర్‌కి చెందిన ఫేమస్ చెఫ్‌లను పిలిపించి మరీ వీటిని తయారు చేయించారు. సిడ్నీ, ఇటాలియన్, ఢిల్లీ..ఇలా రకరకాల డిషెస్‌ని స్పెషల్‌గా తయారు చేయించి సర్వ్ చేశారు. ఆప్ పన్నా, శికాంజీతో పాటు పేడా, మొహంతల్, చుర్మా లడ్డు, కేసర్ పేడా, హల్వా, పిస్తా మిథాని లాంటి స్వీట్స్‌నీ వడ్డించింది. అయితే పెళ్లికి ఇంతకు మించి విందు ఏర్పాట్లు జరగనున్నాయి. 70 ఏళ్లుగా కాశీ చాట్ బండార్ స్థానికంగా చాలా ఫేమస్. ఇక్కడి టమాటా చాట్ అంటే చాలా మందికి ఫేవరేట్. ఈ డిష్‌ని టేస్ట్ చేసేందుకు సంజీవ్ కపూర్, రణ్‌వీర్ బ్రార్ లాంటి చెఫ్‌లు వచ్చారు. అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ఆ తరవాతే ఇదే రెసెపీని రకరకాలుగా మార్చారు. పలు కుకింగ్ షోస్‌లో వీటిని తయారు చేశారు. ఇంత చరిత్ర ఉన్న వంటకాల్ని అంబానీ వెడ్డింగ్‌లో సర్వ్ చేయనున్నారు.