అన్వేషించండి

Anant Ambani Radhika Merchant Wedding: అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ వెడ్డింగ్ గెస్ట్‌లు వీళ్లే, సౌత్ నుంచి వెళ్లేది ఎవరు?

Anant Ambani Radhika Merchant: అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ పెళ్లికి బాలీవుడ్‌ అంతా తరలి వెళ్లనుంది. ఇప్పటికే సంగీత్‌ ఈవెంట్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.

Anant Ambani Radhika Merchant Wedding Guests: అనంత్ అంబానీ రాధికా మర్చంట్ వెడ్డింగ్ వేడుకలకు (anant ambani radhika merchant wedding) అంతా సిద్ధమవుతోంది.ఇప్పటికే సంగీత్ ఈవెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్‌ తారలంతా ఈ ఈవెంట్‌కి క్యూ కట్టారు. అంబానీ కుటుంబంతో కలిసి స్టెప్పులేశారు. జస్టిన్ బీబర్‌ షో హైలైట్‌గా నిలిచింది. జులై 12వ తేదీన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ ఒక్కటి కానున్నారు. జులై 12-14 వరకూ ఈ వేడుకలు ఇంతే ఘనంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే మూడు రోజుల పాటు ఏయే ఈవెంట్స్ జరుగుతాయో అంబానీ ఫ్యామిలీ (Anant Ambani, Radhika Merchant’s Sangeet) ప్రకటించింది. స్పెషల్ కార్డ్ తయారు చేయించి గెస్ట్‌లకు పంపించింది. ముంబయిలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో వివాహం జరగనుంది. 

అయితే...ప్రీవెడ్డింగ్, సంగీత్‌ ఈవెంట్స్‌కే బాలీవుడ్‌లోని ప్రముఖులందరినీ (Anant Ambani, Radhika Merchant Wedding Guests List) ఆహ్వానించింది అంబానీ కుటుంబం. ఇక పెళ్లికి భారీ సంఖ్యలో అతిథులు తరలి రానున్నారు. ఈ లిస్ట్‌లో చాలా మందే ఉన్నారు. బాలీవుడ్ తారలు షారుఖ్‌ ఖాన్, సల్మాన్, ఖాన్‌, ఆమీర్ ఖాన్ ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అలియా భట్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ జులై 12న జరిగే వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. ఇప్పటికే వీళ్లంతా సంగీత్ ఈవెంట్‌లో కనిపించారు. వీళ్లతో పాటు మరికొందరు బాలీవుడ్ తారలూ పెళ్లికి రానున్నారు. కరణ్ జోహార్, కరీనా కపూర్, జాహ్నవీ కపూర్, కరిష్మా కపూర్, సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, అనన్యా పాండేతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఓరీకి ఆహ్వానం అందింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

సౌత్ స్టార్స్ సంగతేంటి..?

వెడ్డింగ్‌కి సౌత్ నుంచి ఎవరిని పిలుస్తున్నారన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే..ప్రీవెడ్డింగ్ వేడుకల్లో మాత్రం కొంత మంది దక్షిణాది సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. సూపర్‌ స్టార్ రజినీ కాంత్‌తో పాటు రామ్ చరణ్, ఉపాసనా కొణిదెల, అత్లీ దంపతులు, సింగర్ హరిహరన్‌ ఈ ఈవెంట్‌కి వెళ్లారు. వెడ్డింగ్‌కి కూడా వీళ్లు హాజరయ్యే అవకాశముంది. వీళ్లతో పాటు మరికొందరు సౌత్ స్టార్స్‌కీ ఆహ్వానం అందిందా అన్నది చూడాలి. 

రాజకీయ అతిథులు..

జులై 12న జరగనున్న వివాహానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశముంది. ఆయనతో పాటు సోనియా గాంధీకి ముకేశ్ అంబానీ ఆహ్వానం అందించారు. స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు. తప్పకుండ పెళ్లికి రావాలని కోరారు. అంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేనీ ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. అయితే..వీళ్లలో ఎంత మంది వస్తున్నారన్నది ఇంకా కన్‌ఫమ్ కాలేదు. ప్రస్తుతానికైతే పెళ్లి ఏర్పాట్లు చాలా జోరుగా కొనసాగుతున్నాయి. 

Also Read: Viral Video: 2020లో మళ్లీ ట్రంప్‌ని ఓడిస్తా, బైడెన్ వింత వ్యాఖ్యలు - టైమ్ ట్రావెలింగ్ చేస్తారేమో అంటూ నెటిజన్ల సెటైర్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget