Amul Milk Prices Hike: అమూల్ పాల ధర లీటర్‌కు మూడు రూపాయలు పెంపు
Amul Milk Prices Hike: అమూల్ పాల ధరలను పెంచారు. లీటరుకు మూడు రూపాయల చొప్పున పెంచినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది.
Amul Milk Prices Hike: అమూల్ పాల ధరలను లీటరుకు రూ. 3 పెంచినట్లు.. సహకార బ్రాండ్ అమూల్‌ను ప్రమోట్ చేస్తున్న గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్రాండ్ తన ఫుల్‌క్రీమ్ మిల్క్, గేదె పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచింది. దీనికి ముందు ఆగస్ట్ 2022లో లీటరుకు రూ. 2 పెంచారు. గుజరాత్, ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబై, అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతంలోని అమూల్ పాలను విక్రయించే అన్ని ఇతర మార్కెట్‌లలో పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచాలని జీసీఎంఎంఎఫ్ నిర్ణయించిందని ఆనంద్-ప్రధాన కార్యాలయ సమాఖ్య తెలిపింది.
Amul has increased prices of Amul pouch milk (All variants) by Rs 3 per litre: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/At3bxoGNPW
— ANI (@ANI) February 3, 2023
ధరలు పెంచడంతో ప్రస్తుతం అమూల్ గోల్డ్ పాలు లీటర్ ధర 66 రూపాయలు అయింది. అమూల్ తాజా పాలు లీటర్ ధర రూ.54, అమూల్ ఆవు పాటు లీటర్ ధర రూ.56, అమూల్ ఏ2 గేదె పాల ధర లీటర్ రూ.70 కు పెంచుతూ అమూల్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో మదర్ డెయిరీ లీడింగ్ మిల్క్ సప్లయర్, పాలీ ప్యాక్స్, వెండింగ్ మిషన్ల ద్వారా రోజూ 30 లక్షల లీటర్లకుపైగా పాలను విక్రయిస్తోంది. అమూల్ దేశంలోనే లీడింగ్ మిల్క్ సప్లయర్, అమూల్ యజమానులు కూడా లక్షల మంది రైతులే. 75 ఏళ్ల క్రితం రెండు గ్రామాల నుంచి 247 లీటర్ల పాలను సేకరించడంతో మొదలైన అమూల్ ప్రయాణం ఇప్పుడు 260 లక్షల లీటర్లకు దూసుకెళ్తోంది.
రిటైల్ పాల ధరల పెరుగుదల, సేకరణ ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగినప్పటికీ.. వ్యవస్థీకృత డెయిరీ రంగం యొక్క లాభదాయకత క్షీణించకుండా నిరోధించవచ్చని నిపుణులు గత సంవత్సరం చెప్పారు. ముఖ్యంగా, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ (ఎన్సీఈ) 70వ ప్లీనరీ సెషన్‌లో ప్రసంగిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బహుళ - రాష్ట్ర సహకార సంఘాన్ని స్థాపించడానికి అమూల్ మరో ఐదు సహకార సంఘాలతో ఐక్యంగా ఉంటుందని పేర్కొన్నారు.