అన్వేషించండి

ఇజ్రాయేల్‌కి ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ బంద్, అప్పటి వరకూ సర్వీస్‌లు రద్దు

Air India Suspension: యుద్ధం నేపథ్యంలో టెల్ అవీవ్‌కి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ సర్వీస్‌లు రద్దయ్యాయి.

Air India Suspension: 

ఎయిర్ ఇండియా సర్వీస్‌లు రద్దు..

ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో Air India టెల్ అవీవ్‌కి రాకపోకలపై ఆంక్షలు విధించింది. అక్కడికి ఫ్లైట్‌ సర్వీస్‌లను నిలిపివేసింది. యుద్ధం మొదలైన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు వారం రోజులు దాటినా ఇంకా ఉద్రికత్తలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆంక్షల్ని కొనసాగిస్తూ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 18 వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. సాధారణంగా ఎయిర్ షెడ్యూల్‌ ప్రకారం...వారానికి ఐదు ఫ్లైట్‌లు టెల్ అవీవ్‌కి ( Tel Aviv) వెళ్తాయి. సోమ, మంగళ,గురు,శని, ఆది వారాల్లో ఈ సర్వీస్‌లు నడుస్తాయి. అంతకు ముందు అక్టోబర్ 14 వరకూ సర్వీస్‌లను నిలిపేసింది. ఇప్పుడు మరో నాలుగు రోజులు ఎక్స్‌టెండ్ చేసింది. అయితే...ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా ఇండియాకి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా సహకరిస్తోంది. కొన్ని ఛార్టెడ్ ఫ్లైట్స్‌ని ఇజ్రాయేల్‌కి పంపుతున్నారు. ఆపరేషన్ అజయ్ (Operation Ajay)లో భాగంగా ఇజ్రాయేల్ నుంచి భారతీయుల్ని సేఫ్‌గా ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు ఎయిర్‌ ఇండియా ఫ్లైట్స్‌ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. 

మిగతా ఎయిర్‌ లైన్స్ కూడా..

ఎయిర్‌ ఇండియాతో పాటు మరి కొన్ని సంస్థలూ సర్వీస్‌లను సస్పెండ్ చేశాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా, లుఫ్తాన్సా, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌ ఫ్రాన్స్, రియాన్ ఎయిర్, ఏజియన్ ఎయిర్‌లైన్స్‌పైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. టెల్ అవీవ్ ఎయిర్‌పోర్ట్‌లోనూ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇండియన్ టూర్ ఆపరేటర్స్‌కీ సమస్యలు తప్పడం లేదు. చివరి నిముషంలో చాలా మంది టూరిస్ట్‌లు ప్లాన్ మార్చేసుకున్నారు. టికెట్స్‌ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇంకొందరు రీషెడ్యూల్ చేస్తున్నారు. ఈ డిసెంబర్‌లో అక్కడ విజిట్ చేయాలని ప్లాన్ చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జోర్డాన్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న వాళ్లూ షెడ్యూల్ మార్చుకున్నారు. నిజానికి డిసెంబర్‌లో ఇజ్రాయేల్, జోర్డాన్, ఈజిప్ట్‌కి టూరిస్ట్‌లు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అక్కడి టూరిజంకి ఇది మంచి సీజన్ కూడా. 2019 అక్టోబర్- డిసెంబర్ లెక్కల ప్రకారం..ఇండియా, ఇజ్రాయేల్‌కి మధ్య  38 వేల 573 మంది రాకపోకలు సాగించారు. అటు యూరప్‌లోనూ టూరిస్ట్‌లు ప్లాన్‌లూ తలకిందులైపోయాయి. 

ఇజ్రాయెల్ నుంచి భారతీయల తరలింపు కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’లో భాగంగా ఇజ్రాయెల్ నుంచి 235 మంది భారతీయులతో రెండవ విమానం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన రెస్క్యూ మిషన్ ‘ఆపరేషన్ అజయ్’. భారతీయుల తరలింపుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రస్తుతానికి చార్టర్ విమానాలను ఉపయోగిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అవసరమైతే వైమానిక దళాన్ని కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. 

Also Read: హమాస్ దాడులకు ఒక రోజు ముందే అమెరికా వార్నింగ్, ఇంటిలిజెన్స్‌ని ఇజ్రాయేల్ లైట్ తీసుకుందా?

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget