హమాస్ దాడులకు ఒక రోజు ముందే అమెరికా వార్నింగ్, ఇంటిలిజెన్స్‌ని ఇజ్రాయేల్ లైట్ తీసుకుందా?
Israel Gaza Attack: హమాస్ దాడులపై అమెరికా ఇంటిలిజెన్స్ ముందుగానే ఇజ్రాయేల్‌ని హెచ్చరించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
Israel Gaza Attack:
అమెరికా నిఘా రిపోర్ట్‌లు..
ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడానికి కొన్ని వారాల ముందే అమెరికా వార్నింగ్ ఇచ్చింనట్టు కొన్ని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. అమెరికన్ ఇంటిలిజెన్స్ Central Intelligence Agency (CIA) ముందుగానే హెచ్చరించింది. హింసాత్మకమైన ఘటనలు జరిగే అవకాశముందని వార్నింగ్ ఇచ్చింది. హమాస్ దాడులు జరగడానికి కొద్ది రోజుల ముందే అమెరికా ఇంటిలిజెన్స్ రెండు రిపోర్ట్‌లు పంపిందట. ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు చేసే అవకాశముందని మొదట సెప్టెంబర్ 28వ తేదీన ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఆ తరవాత మొదటి రిపోర్ట్‌కి కొనసాగింపుగా..అక్టోబర్ 5న మరో నివేదిక సిద్దం చేసింది. హమాస్ ఉగ్రవాదులు హింసకు పాల్పడే ప్రమాదముందని మరోసారి వార్నింగ్ ఇచ్చింది. నిజానికి గత ఏడాది నుంచి సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఈ హెచ్చరికలు చేస్తూనే ఉంది. అయితే..ఇటీవల ఇచ్చిన రెండు రిపోర్ట్‌లనూ ఇజ్రాయేల్ లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటిలాగే అమెరికా ఈ రిపోర్ట్‌లు ఇచ్చి ఉంటుందని భావించింది. కానీ...అనుకున్న దాని కన్నా తీవ్రంగా దాడులు జరిగాయి. అక్టోబర్ 7వ తేదీన ఈ దాడులు జరిగాయి. సరిగ్గా ఓ రోజు ముందు..అంటే అక్టోబర్ 6వ తేదీన అమెరికా ఇంటిలిజెన్స్ అధికారులు ఇజ్రాయేల్‌కి కొన్ని రిపోర్ట్‌లు పంపారు. ఇజ్రాయేల్ సరిహద్దు వద్ద హమాస్ ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందని అప్రమత్తం చేశారు.
ఇజ్రాయేల్ ప్లాన్ చేసుకోలేదా..?
అటు అమెరికాలోనూ టాప్ అఫీషియల్స్ అందరికీ ఈ రిపోర్ట్‌లు షేర్ చేశారు. కానీ..అమెరికా అద్యక్షుడు జో బైడెన్ వరకూ ఇవి వెళ్లలేదు. వీటిని ఎవరూ వైట్ హౌజ్ అధికారులకు బ్రీఫ్ చేయలేదు. వైట్ హౌజ్ అఫీషియల్స్‌కి వివరించాల్సినంత ముఖ్యమైన రిపోర్ట్‌లు అని ఎవరూ చెప్పలేదని కొందరు అధికారులు వాదించారు. ఈ రిపోర్ట్‌లలో ఇజ్రాయేల్, గాజా, వెస్ట్‌బ్యాంక్‌లను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. CIA డైరెక్టర్ బిల్ బర్న్స్ (CIA Director Bill Burns) ఫిబ్రవరిలోనే పదేపదే అప్రమత్తం చేశారు. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతాయని హెచ్చరించారు. ఈ వార్నింగ్స్‌కి తగ్గట్టుగానే దాడులు జరిగాయి. ఈ నివేదికల్ని చాలా "సాధారణంగా" తీసుకున్నారని బిల్ బర్న్స్ అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయేల్ ప్లానింగ్ ఫెయిల్యూర్ కారణంగా ఈ స్థాయిలో నష్టం వాటిల్లిందని తేల్చి చెప్పారు. ఈ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిఘా వైఫల్యం..
సాధారణంగా Israeli Defence Forces (IDF) ముందుగానే ఇలాంటి దాడుల్ని పసిగట్టేసి అప్రమత్తమవుతుంది. కానీ...అసలు హమాస్ ఉగ్రవాదుల కదలికలపై అణువంత అనుమానం కూడా రాలేదని కొందరు అధికారులు చెబుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెట్టకుండా ఎలా ఉన్నారన్నదీ అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఇజ్రాయేల్‌ని ముందుగానే హెచ్చరించినట్టు ప్రకటించింది. పాలస్తీనా పౌరుల హక్కులు అణిచివేతకు గురయ్యాయని, ఎప్పుడో అప్పుడు వాళ్ల నుంచి దాడులు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించింది.
Also Read: టాయిలెట్స్‌నీ వదలని హమాస్ ఉగ్రవాదులు, విచక్షణా రహితంగా కాల్పులు