AIIMS: కళ్యాణి ఎయిమ్స్‌లో 121 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
కళ్యాణికు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
కళ్యాణికు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 121 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 121
* సీనియర్ రెసిడెంట్ పోస్టులు.
విభాగాల వారీగా ఖాళీలు..
➥ అనస్థీషియా: 06
➥ బయోకెమిస్ట్రీ: 02
➥ బర్న్ & ప్లాస్టిక్ సర్జరీ: 03
➥ కార్డియాలజీ: 05
➥ కార్డియోథొరాసిక్ & వాస్కులర్ సర్జరీ: 03
➥ డెర్మటాలజీ: 02
➥ ఎండోక్రినాలజీ: 01
➥ ఈఎన్‌టీ: 02
➥ ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ: 01
➥ గ్యాస్ట్రోఎంటరాలజీ: 04
➥ జనరల్ మెడిసిన్: 03
➥ జనరల్ సర్జరీ: 02
➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్: 02
➥ మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ: 04
➥ మైక్రోబయాలజీ: 01
➥ నియోనాటాలజీ: 08
➥ నెఫ్రాలజీ: 03
➥ న్యూరాలజీ: 04
➥ న్యూరోసర్జరీ: 03
➥ న్యూక్లియర్ మెడిసిన్: 03
➥ ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ: 04
➥ ఫిజియాలజీ: 01
➥ ఆర్థోపెడిక్స్: 05
➥ పీడియాట్రిక్స్ సర్జరీ: 04
➥ పీడియాట్రిక్స్: 07
➥ పాథాలజీ: 03
➥ ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్: 01
➥ సైకియాట్రీ: 02
➥ పల్మనరీ మెడిసిన్: 02
➥ రేడియాలజీ: 07
➥ రేడియో థెరపీ: 01
➥ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ: 03
➥ సర్జికల్ ఆంకాలజీ: 04
➥ ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్: 02
➥ ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్: 09
➥ యూరాలజీ: 04
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 10.06.2023.
ఇంటర్వ్యూ వేదిక: Administrative Building,
1st, Floor, Committee Room of AIIMS,
Kalyani, Pin -741245.
Also Read:
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..