2013 Patna Gandhi Maidan Blasts: 'మోదీ సభలో బాంబు దాడి' కేసులో నలుగురికి ఉరిశిక్ష ఖరారు
2013లో పట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో నలుగురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించింది.
పట్నా గాంధీ మైదాన్‌లో 2013లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 మంది దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది.
2013 Patna Gandhi Maidan serial blasts | NIA Court Patna pronounces quantum of punishment for 9 convicts-4 get capital punishment, 2 get life imprisonment, 2 get 10-yr imprisonment&one gets 7-yr imprisonment
— ANI (@ANI) November 1, 2021
Blasts had occurred at venue of then PM candidate Narendra Modi’s rally
మిగిలినవారికి..
మిగిలిన ఐదుగురు దోషుల్లో ఇద్దరికీ జీవితఖైదు విధించగా మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 11 మందిలో 10 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఈ ఏడాది అక్టోబర్ 27న దోషులుగా తేల్చింది. సరైన ఆధారాలు లేని కారణంగా ఓ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసింది.
వరుస పేలుళ్లు..
2013లో ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో అక్టోబర్ 27న హుంకార్ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఒక్కసారిగా ఆరు బాంబులు పేలాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది గాయాలపాలయ్యారు.
వీటిలో రెండు బాంబులు మోదీ ప్రసంగ వేదికకు 150 మీటర్ల దూరంలో పేలాయి. అయితే ఈ పేలుళ్లన్నీ మోదీ, భాజపా నాయకుల రాకకు ముందే జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసిన ఎన్‌ఐఏ 11 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో 10 మంది సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందినవారు. మరో వ్యక్తి మైనర్ కావడం వల్ల అతడిని మూడేళ్ల పాటు జువెనైల్ హోంలో ఉంచారు.
Also Read: UP CM Yogi Adityanath: తాలిబన్లకు తనదైన స్టైల్‌లో యోగి వార్నింగ్.. 'భారత్ వైపు చూస్తే వైమానిక దాడే'
Also Read: Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!
Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు