News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Rakesh Tikait: కేంద్రానికి రాకేశ్ టికాయత్ అల్టిమేటం.. ఆ తేదీ లోపు రద్దు చేయకపోతే..!

కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ అన్నారు. నవంబక్ 26 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు.

FOLLOW US: 
Share:

నూతన సాగు చట్టాలపై పోరాటం చేస్తోన్న రైతులు తాజాగా కేంద్రానికి అల్టీమేటం జారీ చేశారు. నవంబర్ 26లోపు ఈ మూడు సాగు చట్టాలను రద్దు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.

ఒక వేళ ఈ డెడ్‌లైన్‌ లోపు మూడు సాగు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయకపోతే నవంబర్ 27 నుంచి దిల్లీ సరిహద్దుల వైపు రైతులు కదం తొక్కుతారని టికాయత్ అన్నారు. దిల్లీ పోలీసులు పీకేసిన టెంట్లను మళ్లీ రైతులు ఏర్పాటు చేస్తారని హెచ్చరించారు.

" కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 26 వరకు సమయం ఉంది. కానీ నవంబర్ 27 నుంచి మాత్రం గ్రామాల నుంచి రైతులు ట్రాక్టర్లపై దిల్లీ సరిహద్దులకు చేరుకుంటారు. మరింత ఉద్ధృతంగా నిరసన చేపట్టేందుకు దిల్లీ సరిహద్దులో బలమైన టెంట్లను ఏర్పాటు చేస్తారు.                                       "
-రాకేశ్ టికాయత్, బీకేయూ నేత

గత ఏడాది నవంబర్ నుంచి పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల రైతులు కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయం, తమ భూములు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల భయాలను కేంద్రం తోసిపుచ్చింది. రైతులతో ఇప్పటికే పలు దఫాల చర్చలు సాగినప్పటికీ అవన్నీ విఫలమయ్యాయి.

Also Read: UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు

Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!

Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?

Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?

Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Nov 2021 03:34 PM (IST) Tags: farm laws Centre Farmers Protest Rakesh Tikait BKU Leader Rakesh Tikait Delhi Border

ఇవి కూడా చూడండి

Mallikarjun Kharge: 'బీజేపీది నకిలీ జాతీయవాదం', సాయుధ బలగాల పింఛన్ నిబంధనలపై ఖర్గే విమర్శలు

Mallikarjun Kharge: 'బీజేపీది నకిలీ జాతీయవాదం', సాయుధ బలగాల పింఛన్ నిబంధనలపై ఖర్గే విమర్శలు

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

రేపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 'న్యాక్‌ ఏ+' గుర్తింపు, ర్యాంకింగ్‌లో జేఎన్‌టీయూ అనంతపురం సత్తా

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Manipur CM: 'త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి, విద్యార్థులను చంపిన వారిని పట్టుకుంటాం'

Manipur CM: 'త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి, విద్యార్థులను చంపిన వారిని పట్టుకుంటాం'

NBE Jobs: నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు

NBE Jobs: నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు

టాప్ స్టోరీస్

Vasireddy Padma : ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !

Vasireddy Padma :  ఆ టీడీపీ నేతను అరెస్ట్ చేయండి - డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ !

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

బీజేపీ వైఖరి నచ్చకే NDA నుంచి బయటకు వచ్చేశాం, AIDMK నేత కీలక వ్యాఖ్యలు

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!

Shri Lakshmi Satish Photos: RGV కంట్లో పడిన బ్యూటిఫుల్ లేడీ ఎవరో తెలుసా!