UP Election 2022: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం!
రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎనికల్లో పోటీ చేయడం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తెలిపారు.
పొత్తు కుదిరే..
మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) మధ్య పొత్తు ఉంటుందన్నారు. ఆర్‌ఎల్‌డీతో పొత్తు ఫైనల్ అయ్యిందని.. కేవలం సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు అఖిలేశ్ యాదవ్. శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ కూడా కలిసి వస్తానంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
ప్రస్తుతం ఆజమ్‌ఘఢ్ నుంచి ఎంపీగా ఉన్నారు అఖిలేశ్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేశ్ ఇలాంటి ప్రకటన చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలు అయోమయంలో ఉన్నారు. పార్టీ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే అఖిలేశ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలియాల్సి ఉంది.
వివాదాస్పద వ్యాఖ్యలు..
ఆదివారం జరిగిన ఓ సభలో అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హర్దోయిలో జరిగిన బహిరంగ సభలో మహ్మద్ అలీ జిన్నాను
భాజపా ఫైర్..
అఖిలేశ్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిన్నాతో పటేల్‌ను పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు