Corona Cases: దేశంలో కొత్తగా 12,514 కేసులు, 251 మరణాలు
దేశంలో కొత్తగా 12,514 కేసులు నమోదుకాగా 251 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసులు 15 వేల కన్నా తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 12,514 కేసులు నమోదుకాగా 251 మంది మరణించారు. 12,718 మంది కరోనా నుంచి రికవరయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) November 1, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/C2eOqERN8C pic.twitter.com/THziTzvHus
- మొత్తం కేసుల సంఖ్య: 3,42,85,814
- యాక్టివ్ కేసులు: 1,58,817
- మొత్తం రికవరీలు: 3,36,68,560
- మొత్తం మరణాలు: 4,58,437
- మొత్తం వ్యాక్సినేషన్: 1,06,31,24,205
#Unite2FightCorona pic.twitter.com/eBw3boQvw4
— Ministry of Health (@MoHFW_INDIA) November 1, 2021
ఇప్పటివరకు మొత్తం 106 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కేరళ
కేరళలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 7,167 కరోనా కేసులు నమోదుకాగా 167 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 49,68,657కు చేరగా మొత్తం మరణాల సంఖ్య 31,6819కి పెరిగింది. గత 24 గంటల్లో 65,158 కరోనా శాంపిళ్లను పరీక్షించారు.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 1,046 కేసులు నమోదుకాగా ఆ తర్వాతి స్థానాల్లో తిరువనంతపురం (878), త్రిస్సూర్ (753) ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 1,172 కేసులు నమోదయ్యాయి. 20 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 66,11,078కి పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 1,40,216కు పెరిగింది.
Also Read: Congress Manifesto: యూపీ ఎన్నికల్లో మహిళా ఓటర్లపై కాంగ్రెస్ గురి.. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టో!
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు