Top Headlines: ఏపీ ఉద్యోగులకు కిక్ ఇచ్చే న్యూస్- అంచనాలకు అందని రీతిలో ట్రిపుల్ ఆర్ నిర్మాణం- టాప్ హెడ్‌లైన్స్ ఇవే
Top News: కొత్త సంవత్సరం రోజున చంద్రబాబు చేసిన సంతకంతో 1600 మందికి లబ్ధి చేకూరనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
Today Top Headlines In Ap And Telangana:
న్యూ సైన్
కొత్త సంవత్సరం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీలక దస్త్రంపై సంతకం చేశారు. దీంతో 1600 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ ఒక్క సంతకంతో దాదాపు 24 కోట్ల రూపాయల సీఆర్‌ఎఫ్ నిధులు లబ్ధిదారులకు వెళ్లనున్నాయి. కొత్తగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 120 కోట్ల మేర లబ్ధిదారులకు చేరిందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ వరకు ఏడు వేల ఐదు వందల మందికిపై లబ్ధిదారులకు మేలు చేశామని ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా చదవండి.
ఎటు నుంచి ఏటైనా
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఎవరూ ఊహించని విధంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అన్ని రాష్ట్ర జాతీయ రహదారులను కలుపుతూ దీన్ని నిర్మించేలా ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. 162 కిలోమీటర్లు ఉన్న ఈ ఫోర్‌లేన్ రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులు ఇంటర్ లింక్ కానున్నాయని సమాచారం. గ్రీన్‌ఫీల్డ్ రీజినల్ ఎక్స్‌ప్రెస్‌వే గా వ్యవహరించే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉండే మార్గాలతో సిటీలోకే కాదు, సిటీ శివారులోకి సైతం ఎంటర్ అవకాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. ఇంకా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పనుంది. ఏడు నెలల పాలనలో చాలా అంశాలను పరిష్కరించుకుంటూ వస్తున్న ప్రభుత్వం కొత్త ఏడాదిలో మరిన్ని ఇష్యూలను సాల్వ్ చేయాలని చూస్తోంది. అలాంటి వాటిలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ సమస్య ఒకటి. ఇప్పటికే చాలా కాలంగా వారికి ఈ డీఏ ఇవ్వలేదు. అందుకే దీనిపై ఓ నిర్ణయం గురువారం ప్రకటించనుంది. పెండింగ్‌లో ఉన్న డీఏలు ఉద్యోగులకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇంకా చదవండి.
మందుబాబులం... మేము మందుబాబులం...
నూతన సంవత్సర వేడుకల వేళ మందుబాబు రెచ్చిపోయారు. పట్టపగ్గాల్లేనట్టు తాగి రోడ్లపైకి వచ్చారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వారి తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఫుల్‌గా తాగి వాహనాలు నడుపుతూ పోలీసులపైనే తిరగబడే స్థితికి వచ్చారు. హైదరాబాద్ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో 1,184 మంది మందుబాబులు చిక్కారు. వారిపై కేసులు నమోదు చేశారు. కొత్త ఏడాది వేడుకలు ఇంట్లో చేసుకోవాలని లేకుంటే మద్యం తాగకుండా వాహనాలు నడపాలని పోలీసులు వారం పది రోజుల నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంకా చదవండి.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రదేశాలు ఇవే
తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకూ జరిగేే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్లు ఉన్న వారినే అనుమతి ఇస్తారు. జనవరి 10 శుక్రవారం , 11 శనివారం , 12 ఆదివారం రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలంటే జనవరి 09 ఉదయం 5 గంటల నుంచి తిరుపతి, తిరుమలలో టోకెన్లు జారీ చేస్తారు. మిగిలిన జనవరి 13 నుంచి 19 వరకూ ఏరోజు టోకెన్లు ఆ రోజే ఇస్తారు. దాదాపు పదిహేను ప్రాంతాల్లో ఈ టోకెన్లను ఇచ్చేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇంకా చదవండి.