అన్వేషించండి

Youth Love Being Single : సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న నేటి యువత.. ట్రెండ్ మారిందా? సెట్ చేస్తున్నారా?

Being Single Can Be an Excellent Option : సింగిల్ కష్టాలు మీకు ఏమి తెలుసు అంటారు కానీ.. సింగిల్​గా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. నిజంగా సింగిల్​గా ఉండడం వల్ల అన్ని లాభాలున్నాయా?

The Joy of Being Single : నీకేమి తెలుసురా సింగిల్ గాడివి అంటూ ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటారు కానీ.. నిజంగా సింగిల్​గా ఉంటే ఎన్నో లాభాలు ఉన్నాయట. ఈ మధ్యకాలంలో ఆఫీస్, ఇళ్లు, ఫ్యామిలీ ఇలాంటి ఒత్తిడి ఎక్కువైపోతుంది. వివిధ కారణాలవల్ల చాలామంది స్ట్రెస్​కి గురవుతున్నారు. అయితే ఈ లిస్ట్​లో ఎవరైనా కాస్త హ్యాపీగా ఉంటున్నారా అంటే అది కేవలం సింగిల్సే అని చెప్పాలి. 

రిలేషన్స్ కష్టాలు..

ఏ రిలేషన్ అయినా కొత్తలో బాగానే ఉంటుంది కానీ.. రోజులు గడిచే కొద్ది వారి ఫ్రీడమ్, ఇండివిడ్యూవాలటీ పోతుంది. ఈ తరహా మైండ్ సెట్ గతంలో పెద్దగా కనిపించేంది కాదు. కానీ ఈ జెనరేషన్​లో ఫ్రీడమ్ అనేది చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇది లేకపోవడమే అతి పెద్ద ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు. సింగిల్​గా ఉండే వ్యక్తి ఫ్యామిలీ పర్సన్​గా మారినప్పుడు ఈ డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. దీనివల్లే భార్య భర్తల మధ్య మనస్ఫర్థలకు కారణమవుతుంది. విడిపోయేవారు ఎక్కువయ్యే కొద్ది రిలేషన్స్ మీద యువతలో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అందుకే వివిధ డేటింగ్స్​, సింగిల్స్​గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

సెల్ఫ్​ లవ్​

అయితే సింగిల్​గా ఉండడం వల్ల ఫ్రీడమ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్​ లవ్​ అనేది మొదటి ప్రయారిటీ అవుతుంది. ఆర్థికంగా కూడా కాస్త లిబర్టీ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. ఎవరో కంట్రోల్ చేస్తే ఇబ్బందిగా ఫీల్​ అవుతారు కానీ.. సెల్ఫ్ కంట్రోల్​ అనేది కాన్ఫిడెన్స్​ని బూస్ట్ చేస్తుంది. అలాగే వ్యక్తిగతంగా అభివృద్ధి చెందేందుకు టైమ్ దొరుకుతుంది. తమకు ఇష్టమైన పనులు, రుచులు ఆస్వాదించే వీలు ఉంటుంది. అదే ఫ్యామిలీ లైఫ్​లో ఇవన్నీ ఉండవు అని కాదు కానీ.. కాంప్రిమైజ్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది.

స్టడీ ఏమంటుందంటే..

ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ సింగిల్స్​పై అధ్యయనం చేసింది. అమెరికాలో దాదాపు 30 శాతం మంది ఒంటరిగా ఉంటున్నారట. 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నవారు వీరిలో సగం ఉన్నారట. 30 నుంచి 49 సంవత్సరాల వయసు వారిలో 20 శాతం మంది ఒంటరిగా ఉన్నారట. ఈ సింగిల్ హుడ్​ని దాదాపు 79 శాతం మంది స్వాగతిస్తున్నట్లు ఈ స్టడీలో తేలింది. 

సంతృప్తిగా జీవిస్తున్నారట..

తమని తాము ఆనందంగా ఉంచుకునేందుకు సోలో ట్రిప్స్​కి ఎలాంటి బెరుకు లేకుండా వెళ్లగలుగుతున్నారట. ఒంటరిగా ప్రయాణం చేసి.. నచ్చిన ప్రదేశాలు చూస్తున్నారట. స్వీయ సంరక్షణకు ఎక్కువ ప్రాధన్యతను ఇస్తున్నారట. స్నేహాలు, సంబంధాలు పెంచుకుంటున్నట్లు, వ్యక్తిగత లక్ష్యాలు, అభిరుచిలు ఫాలో అవుతున్నట్లు, సౌకర్యవంతమైన, సంతోషకరమైన ఇంటి వాతవరణాన్ని అనుభవిస్తూ సంతృప్తిగా ఉంటున్నారు. 

ఒత్తిడి తప్పదు.. 

సింగిల్స్ ఎంత హ్యాపీగా ఉన్నా.. సామాజిక ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడం మాత్రం కష్టమే. ఎందుకంటే సింగల్​గా ఉండడాన్ని సమాజం అసమర్థతగా భావిస్తుంది. అలాగే ఒంటరితనం ఎలాంటి ఇబ్బందులకు దారితీస్తుందో గుర్తు చేసి.. ఒత్తిడి పెంచుతుంది. కొందరు బై ఛాయిస్ సింగిల్​గా ఉంటారు. మరికొందరు ఇదే ఆప్షన్​గా తీసుకుని సింగిల్​గా ఉంటారు. అయితే ఈ లైఫ్​ బోర్​ కొడుతుందని కాకుండా.. మీ లైఫ్​లో ఇంకొకరు ఉంటే హ్యాపీగా ఉంటామనుకున్నప్పుడు సింగిల్​ లైఫ్​కి బాయ్ చెప్పేయొచ్చు. 

Also Read : 2024లో న్యూ డేటింగ్ ట్రెండ్.. రిస్క్​ లేకుండా ఈ రిలేషన్​షిప్​ ఏదో బానే ఉందిగా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sleep Issues : యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
Daily Habits Affecting Productivity : మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
Gym Headphones : జిమ్‌లో హెడ్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే మీ చెవులకు ముప్పు తప్పదంటోన్న నిపుణులు
వర్కవుట్ చేస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్‌ వాడుతున్నారా? నిపుణులు ఇస్తోన్న ప్రమాద హెచ్చరికలు ఇవే.. 
Washing Machine Tips : వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget