Pineapple: చవకగా దొరికే ఈ పండుతో సులువుగా బరువు తగ్గొచ్చు, రోజుకో రెండు ముక్కలు తినండి చాలు
సీజనల్ పండ్లలో పైనాపిల్ ఒకటి. దీన్ని మీరు కచ్చితంగా తినాల్సిందే.
బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లలో చాలా మంది ఏమీ తినకుండా నోరు కట్టేసుకుంటారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తింటూ బరువు తగ్గడమే సరైన పద్దతి. చల్లని వాతావరణంలో అధికంగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి. అందరికీ అందుబాటు ధరలో దొరికే ఈ పండు బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. కాస్త తీపిగా, పుల్లగా ఉండే ఈ పండు మీలో చక్కెర తినాలన్న కోరికను తీర్చి, ఆకలిని తగ్గిస్తుంది. ఈ పండు వల్ల అందే అదనపు కేలరీలు చాలా తక్కువ, పోషకాలు చాలా ఎక్కువ. ఈ జ్యూసీ పండు కిలోల కొద్దీ బరువును తగ్గించేందుకు సాయపడుతుంది.
కార్బోహైడ్రేట్లు తక్కువ
తక్కువ కేలరీలు కలిగిన ఈ పైనాపిల్ లో కార్బోహైడ్రేట్లు కూడా చాలా తక్కువ. పైనాపిల్‌లోని ఒక ముక్కలో కేవలం 42 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇక కార్బోహైడ్రేట్లు కూడా నాలుగు శాతం మాత్రమే ఉంటాయి. ఈ కొలతలతో బరువు పెరగడం అసాధ్యం.
పొట్ట కొవ్వుకు చెక్
పైనాపిల్ పండ్లలో బ్రోమెలైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రొటీన్ అణువులను విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా కొవ్వు శరీరంలో చేరదు. ముఖ్యంగా జీర్ణక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీర బరువు పెరగనివ్వదు. కొవ్వును కరిగిపోయేలా చేసి నడుము సన్నగా ఉండేలా చేస్తుంది.
జీవక్రియను పెంచి
ఈ పండులో బ్రోమెలైన్ అనే ప్రొటీన్ ఉంటుందని చెప్పాం కదా, అది జీవక్రియ రేటును కూడా అధికంగా పెంచుతుంది. ఇది అదనపు కిలోలను కోల్పోయేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది తినడం వల్ల కడుపుబ్బరం తగ్గుతుంది.
ఫైబర్ అధికం
పైనాపిల్‌లో కరిగే ఫైబర్, అలాగే కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి పొట్టని ఎక్కువ కాలం పాటూ నిండుగా ఉంచుతాయి. పొట్ట నిండా ఆహారం ఉన్న ఫీలింగ్ కలిగి తినడం తగ్గిస్తారు. కాబట్టి ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికం. పండు నీటితో నిండి ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరం ఇలా తేమవంతంగా ఉండడం వల్ల ఆహారం తినాలన్న కోరిక అధికంగా వేయదు. అతిగా తినకుండా అలా అడ్డుకుంటుంది.
నిండుగా మాంగనీస్
పైనాపిల్ పండులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరంలో కొవ్వు, కార్బోహైడ్రేట్ల జీవక్రియను పెంచుతుంది. తద్వారా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. మాంగనీస్ పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించడంలో ముందుంటుందని ఒక అధ్యయనం కనుగొంది.
పైనాపిల్ లో బీటాకెరాటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటిచూపును కాపాడుతుంది. పైనాపిల్ పండును రోజూ తినడం వల్ల చర్మసౌందర్యం కూడా పెరుగుతుంది. జుట్టు, గోళ్లు, చర్మం నిగనిగలాడుతాయి.
Also read: ఒకేసారి ఆరు ఉద్యోగాలు, అయిదు కోట్ల రూపాయల సంపాదన, ఎవరీ సూపర్ మ్యాన్?
Also read: ఉదయాన లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ కావచ్చు, కొత్త అధ్యయన ఫలితం