New Study: ఉదయాన లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ కావచ్చు, కొత్త అధ్యయన ఫలితం
క్యాన్సర్ లక్షణాలలో మరో కొత్త లక్షణాన్ని కనిపెట్టారు పరిశోధకులు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు కారణమవుతన్న భయంకర రోగాలలో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్యర్ అనేది ఒక కణంలో చిన్న పుండులా ప్రారంభమై దశలవారీగా వృద్ధి చెందుతూ, ముదిరిపోతుంది. అది కాస్త ముదిరాకే లక్షణాలను చూపడం ప్రారంభిస్తుంది. కణాలు నియంత్రణ లేకుండా పెరగడం, కణితి మారి అభివృద్ధి చెంది అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇది శరీరంలో వ్యాప్తి చెందుతూ క్లిష్ణంగా మారుతుంది. చికిత్స కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఒక్కసారి తగ్గాక మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే క్యాన్సర్ ఒక భయంకరమైన రోగం. ప్రొస్టేట్, రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్‌లు అధికంగా వస్తున్నాయి. అయితే క్యాన్సర్ తాలూకు ఒక కొత్త లక్షణాన్ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. ఆ లక్షణం చాలా సాధారణంగా ఉండడంతో ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే పరిశోధనకర్తలు ఆ లక్షణాన్ని తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు.
ఏమిటా లక్షణం?
ఉదయం లేచిన వెంటనే చాలా మంది చేసే పని మూత్ర విసర్జనకు వెళ్లడం. కొంత మందిలో మాత్రం తుమ్ములు, ముక్క కారడం, దగ్గు కనిపిస్తుంది. వీటితో పాటూ అలసట కూడా తోడైతే మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఉదయం లేవగానే దగ్గు, అలసట రెండూ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించమని సూచిస్తున్నారు. ఈ లక్షణం ఒక్కోసారి శరీరంలో దాగున్న కాన్సర్ వల్ల కలుగవచ్చని చెబుతున్నారు. అలాగే రెండు వారాల పాటూ ఉదయం లేవగానే గొంతునొప్పి కలుగుతుంటే కూడా క్యాన్సర్ గా అనుమానించవచ్చు. ధూమపానం చేసే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వస్తే అధికంగా ఇలాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.
క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం క్యాన్సర్ రావడానికి కారణాలు ఇవే...
1. వంశపారంపర్యం
2. జన్యువుల కారణంగా
3. ధూమపానం
4. మద్యపానం
5. అయోనైజింగ్ రేడియేషన్‌కు గురికావడం
6. రసాయన క్యాన్సర్ కారకాల వల్ల
7. వైరస్‌లు లేదా పరాన్న జీవులు వంటి జీవ సంబంధమైన క్యాన్సర్ కారకాలకు గురికావడం వల్ల
8. ఆర్సెనిక్ కలిగిన ఆహారాన్ని, నీటిని తినడం లేదా తాగడం వల్ల
రాకుండా ఎలా అడ్డుకోవచ్చు?
ఆరోగ్యకరమైన జీవనశైలి మాత్రమే క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలదు. వారసత్వం వచ్చే క్యాన్సర్లను అడ్డుకోలేం కానీ, చెడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే వాటిని మాత్రం అడ్డుకోగలం. రోజూ శారీరక వ్యాయామం చేస్తూ, ఆకుపచ్చని కూరగాయలు, గుడ్లు, చికెన్, తాజా పండ్లు వంటివి తినాలి. దాదాపు ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యతనివ్వాలి.
Also Read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి
Also read: ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం, అంతకన్నా తగ్గితే ఏమవుతుంది?