Sleeping Sideways: పక్కకి తిరిగి నిద్రపోతే ఎన్ని లాభాలో తెలుసా?
నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ ఏ విధంగా నిద్రపోతే లాభమో తెలుసా?
శరీరానికి సమతులాహారం ఎంత ముఖ్యమో, నిండైన నిద్ర (Sleeping) కూడా అంతే అవసరం. కానీ చాలా మంది సరిగా నిద్రపోరు. అర్థరాత్రి వరకు ఫోన్లు, సినిమాలు చూస్తూ గడిపేస్తారు. అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి నిద్రలేమితో ముడిపడి ఉన్న అనారోగ్యసమస్యలు. అందుకే నిద్రను తక్కువ అంచనా వేయొద్దని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు. మార్చి 18 ‘ప్రపంచ నిద్రా దినోత్సవం’ (Worlds Sleeping Day) చక్కటి నిద్రపోవాలంటే పక్కకి తిరిగి నిద్రపోవాలి. వెల్లకిలా, బోర్లా కన్నా పక్కకి తిరిగి పడుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి.
గురక తగ్గుతుంది
పక్కకి తిరిగి పడుకోవడం వల్ల గురక (Snoring) వచ్చే అవకాశం తక్కువ. వెల్లకిలా పడుకున్నప్పుడు వాయుమార్గం ఇరుకుగా మారి శ్వాస ఆడడం కష్టమవుతుంది. దాని వల్ల గురక వస్తుంది. పక్కకి తిరిగి నిద్రపోతే వాయుమార్గం స్వేచ్ఛగా ఉండి,శ్వాసనాళానికి ఎలాంటి అడ్డంకి ఉండదు. కాబట్టి గురక రాదు.
స్లీప్ అప్నియా
నిద్రలోనే ప్రాణాలు తీయగల సామర్థ్యం స్లీప్ అప్నియాకు ఉంది. స్లీప్ అప్నియా ఒక ప్రమాదకరమైన నిద్ర రుగ్మత. ఇది శ్వాసను నిద్రలోనే ఆపేస్తుంది. ఈ పరిస్థితి అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, గుండెజబ్బులు, ఉబ్బసం వంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ.పక్కకి తిరిగి పడుకోవడం వల్ల స్లీప్ అప్నియా వచ్చే పరిస్థితి తగ్గుతుంది. పక్కకి తిరిగి నిద్రపోవడం వల్ల సైనస్ నొప్పి కూడా తగ్గుతుంది.
జీర్ణక్రియకు మేలు
భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. దీని వల్ల గ్యాస్ట్రిక్ ఆమ్లాలు గొంతులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ పక్కకి తిరిగి నిద్రపోవడం వల్ల పొట్టలోని ఆమ్లాలు, ఆహారం సరైన స్థానంలోనే ఉండి జీర్ణక్రియ బాగా జరుగుతుంది. పక్కకి తిరిగి నిద్రపోవడం వల్ల గురుత్వాకర్షణ ఆమ్లాలను పొట్ట నుంచి పైకి ప్రవహించుకుండా అడ్డుకుంటుంది.
వెన్నునొప్పి తగ్గుతుంది
పక్కకి తిరిగి నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి రాదు, ఎవరికైనా వెన్ను నొప్పి ఉన్నా కూడా తగ్గిపోతుంది. పక్కకి పడుకున్నప్పుడు వెన్నుముఖ సహజంగా తానుండే ఆకారంలోనే ఉంటుంది కాబట్టి దాని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ స్లీపింగ్ భంగిమ భుజం నొప్పిని కూడా తగ్గిస్తుంది.
గర్భిణిలకు...
గర్భంతో ఉన్న మహిళలకు ఉత్తమమైన నిద్ర భంగిమ ‘పక్కకి తిరిగి నిద్రపోవడం’. పొట్ట పెద్దగా ఉన్నప్పుడు వెల్లకిలా నిద్రపోకూడదు. తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదం. పక్కకి తిరిగి పడుకుంటే తల్లీబిడ్డల గుండెకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.
మెదడుకు అవసరం
పక్కకి పడుకోవడం వల్ల మెదడులోని టాక్సిన్లు తొలగిపోతాయి. ఇది అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులను నివారించడంలో ఈ భంగిమ కీలకపాత్ర పోషిస్తుంది. మెదడులోని వ్యర్థాలను తొలగించే శోషరస వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.
Also read: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది
Also read: ఇంటి దగ్గరే ఆర్గానిక్ హోలీ రంగులు, ఏ రంగును ఎలా తయారుచేయాలంటే