Brain Health: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది
మెదడుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తినాల్సిన ఉత్తమ ఆహారాల జాబితాను హార్వర్డ్ నిపుణులు విడుదల చేశారు.
శరీరాన్ని కంట్రోల్ చేసేది మెదడే. అలాంటి మెదడు ఆరోగ్యాంగా లేకపోతే శరీరం మొత్తం పట్టుతప్పుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం పడుతుంది. గుండె, మూత్రపిండా పనితీరు, కాలేయం... ఇలా అన్నింటినీ నియంత్రించే శక్తి మెదడుకు ఉంది. అందుకే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న పోషకాహార నిపుణులు తాజాగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాల జాబితాను విడుదల చేశారు. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే జ్ఞాపకశక్తినిపెంచుతాయి. మొత్తం మెదడును చురుగ్గా పనిచేసేలా చేసి శరీరాన్ని కాపాడతాయి.
డార్క్ చాకొలెట్
కాస్త చేదుగా ఉన్నప్పటికీ డార్క్ చాకొలెట్ తినడం చాలా అవసరం. ఇందులో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మానసికస్థితిని ప్రశాంతంగా ఉంచడంలో డార్క్ చాకొలెట్ చాలా అవసరం. 2019లో చేసిన అధ్యయనం ప్రకారం డార్క్ చాకోలెట్‌ను రోజూ తినడం వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం 70 శాతం తగ్గుతుంది.
మసాలా
వంటింట్లో దొరికే పసుపు, అల్లం, కారం, కుంకుమపువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు... వంటి మసాలాలను కూడా వంటల్లో భాగం చేసుకోవాలి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలకు చెక్ పెడతాయి. కుంకుమపువ్వులోనూ డిప్రెషన్ ను తగ్గించు లక్షణాలు ఉన్నాయి.
నట్స్
బాదంపలుకులు, వాల్‌నట్స్, జీడిపప్పు, బ్రెజిల్ నట్స్ వంటి గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు తోడ్పతుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటూ, కీళ్లను లూబ్రికేట్ చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వీటిలో ఎక్కువ. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంతోె పాటూ, ఆలోచనలను మెరుగుపరుస్తాయి. రోజుకు ఓ గుప్పెడు నట్స్ తినడం చాలా మేలు.
అవకాడోలు
మనదేశంలె అవకాబోలు అధిక ధర పలుకుతాయి. ఈ పండులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. ఇది బ్రెయిన ఫంక్షనింగ్ కు అవసరం. చాలా అధ్యయనాలు మెగ్నిషియం లోపిస్తే డిప్రెషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తేల్చాయి.
ఫెర్మెంటెడ్ ఆహారాలు
పులియబెట్టిన ఆహారాలు అంటే పెరుగు, నిల్చ పచ్చళ్లు లాంటివి ఫెర్మెంట్ ఆహారాల కిందకి వస్తాయి. వీటిలో మంచి బ్యాక్టిరియా పుష్కలంగా లభిస్తుంది. 45 అధ్యయనాల్లో కనుగొన్న విషయాలను పరిశీలిస్తే ఫెర్మెంటెడ్ ఆహారాలు మెమెరీని పెంచుతాయని తేలింది. వీటిని వేడి చేస్తే మాత్రం వాటి గుణాలు కోల్పోతాయి. కాబట్టి ఎప్పుడు ఫెర్మెంటెడ్ ఆహారాలను వేడి చేయద్దు.
ఆకుకూరలు
పాలకూరలాంటి ఆకుకూరలు తరచూ తింటుండాలి. వీటిలో ఫొలేట్, ఇనుము, విటమిన్ బి9, ఫైబర్ అధికంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పోషకాలు అవసరం.
Also read: ఇంటి దగ్గరే ఆర్గానిక్ హోలీ రంగులు, ఏ రంగును ఎలా తయారుచేయాలంటే
Also read: పరగడుపునే ఒక స్పూను నెయ్యి తాగమని ఆయుర్వేదం చెబుతోంది, ఎందుకు?