World Pneumonia Day : పిల్లల్లో న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. అవగాహనలేకనే లక్షల్లో ప్రాణాలు కోల్పోతున్నారట
World Pneumonia Day 2024 : పెద్దల నుంచి పిల్లలవరకు న్యుమోనియా వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యకు గల కారణాలు, చికిత్స మొదలైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
World Pneumonia Day 2024 History and Theme : ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా గురించి అవగాహన కల్పిస్తూ.. నవంబర్ 12వ తేదీన ప్రపంచ న్యూమోనియా దినోత్సవంగా జరుపుతున్నారు. ఈ ఆరోగ్య సమస్యకు గల కారకాలు.. రాకుండా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే ఫాలో అవ్వాల్సిన చికిత్స విధానలపై అవగాహన కల్పిస్తారు. అసలు దీని చరిత్ర ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచ న్యూమోనియా డే ప్రాముఖ్యత ఏంటి? అసలు న్యూమోనియా అంటే ఏమిటి? దానికి కారకాలు వంటి విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
న్యూమోనియా..
న్యూమోనియా ఊపిరితిత్తుల్లో వచ్చే ఆరోగ్య సమస్య. ఇది అంటువ్యాధి. ఇది ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఈ వ్యాధి వస్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో వాపు కలుగుతుంది. ఈ ఎయిర్ బ్యాగ్స్ ఫస్తో లేదా చీముతో నిండి.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి. అనంతరం ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. వారిలో మరణానికి కారణమవుతుంది. అశ్రద్ధ వహిస్తే పెద్దలకు కూడా ఇబ్బందులు తప్పవు.
ప్రపంచ న్యుమోనియా దినోత్సవం చరిత్ర, థీమ్ ఇదే
చైల్డ్ న్యుమోనియాకు వ్యతిరేకంగా.. గ్లోబల్ కోయలిషన్.. నవంబర్ 12, 2009లో మొదటిసారి స్టాప్ న్యుమోనియా క్యాంపైన్ చేపట్టింది. దీనినే మొదటి ప్రపంచ న్యుమోనియా దినోత్సవంగా చెప్తారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ద్వారా పిల్లల్లో మరణాలు సంభవించవచ్చు. ఈ నేపథ్యంలో న్యుమోనియాపై అవగాహన కల్పిస్తూ.. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
2024 థీమ్
న్యుమోనియాపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఓ థీమ్‌తో వస్తారు. 2024 ప్రపంచ న్యుమోనియా దినోత్సవం థీమ్ ఏంటంటే.. ఎవ్రీ బ్రీత్ కౌంట్స్. స్టాప్ న్యూమోనియా ఇన్ ఇట్స్ ట్రాక్‌తో.. వ్యాధిని గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై అవగాహన అందిస్తున్నారు.
ప్రాముఖ్యత ఇదే..
న్యుమోనియా అనేది నివారించగలిగిన అంటు వ్యాధే. కానీ అశ్రద్ధ చేస్తేనే ప్రాణాంతకమవుతుంది. ఈ అంటువ్యాధిపై సరైన అవగాహన లేక.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో సుమారు 2.5 మిలియన్లకు పైగా ప్రజలు న్యుమోనియాతో ప్రాణాలు కోల్పోయారు. ఏటా ఐదు సంవత్సరాల కంటే చిన్నవారు సుమారు 7 లక్షలమంది పిల్లలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. కొవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది.
న్యుమోనియా లక్షణాలు ఇవే
దగ్గు, జ్వరం, చలి వంటివి న్యుమోనియా లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతిలో నొప్పి, కంఫర్ట్‌గా లేకపోవడం, ఫటిగో, కళ్లు తిరగడం, వాంతులు, డయేరియా వంటివి న్యుమోనియా లక్షణాలు. వీటిని గుర్తిస్తే వెంటనే వైద్య సేవలు తీసుకోవాలి. దీనివల్ల సమస్య ప్రాణాంతకం కాకుండా ఉంటుంది. సమస్య కంట్రోల్ అవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
న్యుమోనియా రాకుండా కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వొచ్చు. pneumococcal, ఫ్లూ వ్యాక్సిన్లు వేయిస్తే ఈ సమస్య దరిచేరదు. హైజీన్‌గా ఉండాలి. చేతులను రెగ్యూలర్‌గా వాష్ చేయాలి. ధూమపానం చేయకూడదు. స్మోక్ చేసేవారికి దగ్గరగా ఉండకూదు. హెల్తీ డైట్ తీసుకోవాలి. రెగ్యూలర్‌గా వ్యాయామం చేయాలి. ఆస్తమా సమ్యలు ఉన్నవారు కచ్చితంగా రెగ్యూలర్ చెకప్స్ చేయించుకోవాలి.
Also Read : చిల్డ్రన్స్ డే 2024 విషెష్.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఇలా విష్ చేసేయండి