అన్వేషించండి

Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు

Winter Care : ఏ సీజన్​లో అయినా పిల్లలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చలికాలంలో కొన్ని టిప్స్ రెగ్యూలర్​గా ఫాలో అయితే.. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకీ నిపుణుల సలహాలు ఏంటి?

Winter Health Precautions for Babies : ఈ మధ్య ఎండ, చలి తేడా లేకుండా తీవ్రమైన స్థాయిలో వాతావరణం ఉంటుంది. ఎండలు మండిపోతుంటే.. చలి చంపేస్తుంది. పెద్దలంటే ఏదొకటి చేసి.. ఈ పరిస్థితులకు అలవాటు పడుతూ ఉంటారు. కానీ పిల్లల సంగతి? వామ్మో పిల్లలున్న వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడసలే చలికాలం కూడా మొదలైపోయింది. ఈ సమయంలో జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఈ టైమ్​లో పిల్లలన్ని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఏ మిస్టేక్స్ చేయకూడదు? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో తెలుసుకుందాం.

డ్రెస్సింగ్ విషయంలో.. 

పిల్లలకు స్వెట్టర్లు లాంటివి వేసేయకుండా.. తేలికైన డ్రెస్​లను లేయర్లుగా వేయాలి. దీనివల్ల వారికి ఇరిటేషన్​గా ఉండదు. పైగా వారికి కంఫర్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. బ్రీత్​బుల్​, మాయిశ్చర్​ కలిగిన దుస్తులు వేయాలి. తలకు టోపి లేదా స్కార్ఫ్​లు కట్టాలి. బయటకు వెళ్లేటప్పుడు వీటిని కచ్చితంగా తీసుకువెళ్లాలి. 

స్కిన్ కేర్.. 

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. చలికాలంలో చర్మం బాగా డ్రై అవుతుంది. అందుకే వారికి రెగ్యూలర్​గా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. లేదంటే డ్రై స్కిన్ చర్మంపై ఇరిటేషన్ రప్పిస్తుంది. బేబి ఫ్రెండ్లీ సన్​స్క్రీన్స్​ రాయొచ్చు. మైల్డ్ సువాసనను ఇచ్చే క్లెన్సర్స్​ ఉపయోగించవచ్చు. వీటివల్ల బేబి స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. 

ఆరోగ్యం.. 

పిల్లలకు రెగ్యూలర్​గా వ్యాక్సిన్స్ వేయించాలి. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాలు వ్యాధులు, వైరస్​లు ఎటాక్ చేస్తుంటాయి. వ్యాక్సిన్స్​తో కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే పిల్లలను, వారు ఉండే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల ఇన్​ఫెక్షన్లు ఉండవు. జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తే.. వెంటనే అలెర్ట్ అవ్వాలి. వైద్యుల సహాయం త్వరగా తీసుకుంటే మంచిది. లేదంటే జలుబుతో ముక్కుపట్టేసి వారు ఇబ్బంది పడొచ్చు. 

పిల్లలకు కలిగే ఇబ్బందులు.. 

చలి వల్ల పిల్లల్లో.. Respiratory syncytial virus వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇన్​ఫ్లూయేన్జా, హైపోథెర్మియా, డీహైడ్రేషన్, స్కిన్ సమస్యలు పిల్లలకు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం కూడా ఫ్రీక్వెంట్​గా వస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. 

నిద్ర.. 

పిల్లలకు ఎప్పుడు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే వారు బాడీ టెంపరేచర్​ రూమ్​ టెంపరేచర్​ ఉండేలా చూసుకుంటే మంచిది. మంచి పరుపు కూడా మంచి నిద్రను అందిస్తుంది. వారికి ఇతర ఇబ్బందులు రాకుండా హెల్ప్ చేస్తుంది. చలి ఎక్కువగా ఉందని.. బాగా వేడి చేసిన వస్తువులు.. నీళ్లు ఇవ్వకూడదని గుర్తించుకోవాలి. 

ఫీడింగ్.. 

చలికాలంలో పిల్లలకు ఎక్కువ ఫ్లూయిడ్స్ అందించాలి. గోరువెచ్చని లేదా నార్మల్ నీటిని వారికి అందించాలి. అలాగే.. ఫార్మూల మిల్క్ లేదా.. బ్రెస్ట్​ ఫీడ్​ని రెగ్యూలర్​​గా ఇవ్వాలి. చల్లని పదార్థాలు, చల్లని ఆహారాలు అందించకపోవడమే మంచిది. 

బయటకు వెళ్లేప్పుడు.. 

చిన్నపిల్లలను తీసుకుని బయటకు వెళ్లేప్పుడు.. కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. చలి బాగా ఎక్కువగా ఉంటే.. పిల్లలను బయటకు తీసుకువెళ్లకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్తే.. వారిని ఫుల్​గా కవర్​ చేసి తీసుకెళ్లండి. అలాగే సన్​స్క్రీన్, లిప్​బామ్​ని అప్లై చేయండి. డైపర్స్, పాలు, మందులను మీ వెంట తీసుకెళ్లండి. అలాగే ఎక్​స్ట్రా డ్రెస్​లను కూడా తీసుకువెళ్తే మంచిది. తలను మాత్రం కచ్చితంగా కవర్ చేయాలి. 

ఇవన్నీ కేవలం అవగాహన కోసమే అయినా.. పిల్లల విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదని చెప్తున్నారు నిపుణులు. అలాగే పెద్దలు ఫ్లూ వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే.. వారు పిల్లలకు దగ్గరగా వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఎందుకంటే.. వారికి కూడా త్వరగా ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశముందని చెప్తున్నారు. 

Also Read : దీపావళి సమయంలో కళ్లు జాగ్రత్త.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?మహేశ్ రాజమౌళి సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Apple Intelligence Devices: ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
ఐవోఎస్ 18.1 వచ్చేసింది - యాపిల్ ఇంటెలిజెన్స్ ఇక అందరికీ అందుబాటులో!
SSMB 29: సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
సింహాన్నిచూపిస్తూ హింట్... రాజమౌళి కొత్త పోస్ట్ వైరల్ - మహేష్ బాబు పాత్ర ఇదేనా?
RBI: లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
లండన్‌ నుంచి భారత్‌కు లక్షా 2 వేల కిలోల బంగారం - ధనత్రయోదశీని ఆర్బీఐ అలా ప్లాన్ చేసింది !
Embed widget