
Eye Protection Tips for Diwali : దీపావళి సమయంలో కళ్లు జాగ్రత్త.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Diwali Eye Care : దీపావళి కాంతులను పంచే పండుగే కానీ... అజాగ్రత్తగా ఉంటే కంటి చూపును శాశ్వతంగా దూరం చేసేస్తుంది. అందుకే టపాసులు కాల్చేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Protect your vision this Diwali : దీపావళి (Deepawali 2024) సమయంలో క్రాకర్స్ కాల్చకపోతే.. అది పండుగలానే ఉండదు కొందరికి. అందుకే ఎక్కువ మోతాదులో టపాసులు, బాంబులు కాల్చుతూ ఉంటారు. దీనివల్ల వాయుకాలుష్యం ఎక్కువ అవుతుంది. పెట్స్ ఇబ్బంది పడతాయి. అజాగ్రత్తగా ఉంటే కంటిచూపు కూడా దెబ్బతింటుంది. అందుకే దీపావళికి మందులు కాల్చేప్పుడు.. లేదా వాటిని చూసేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
క్రాకర్స్, బాంబులు, మతాబులు కాల్చేప్పుడు వాటికి దూరంగా ఉండాలి. కుదిరితే.. కంటికి ఇబ్బంది కలిగించకుండా కళ్లద్దాలు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా క్రాకర్స్ కాల్చేప్పుడు ఇవి పెట్టుకుంటే చాలామంచిది. ఫైర్ వర్క్స్‌ని నేరుగా చూడడం మానుకోండి. ఎందుకంటే.. వాటినుంచి నిప్పురవ్వలు ఎగిరి.. కంటిలో పడే ప్రమాదముంది. చిన్నపిల్లలను క్రాకర్స్ కాల్చేప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. లేదంటే వారు కళ్లతో పాటు.. చేతులు కాలడం వంటి మరిన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదముంది. కాబట్టి పిల్లల విషయంలో అలెర్ట్‌గా ఉండాలి.
కంటి సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు
క్రాకర్స్ కాల్చేప్పుడు అదే చేతులతో కంటిని రుద్దుకోకూడదు. ముఖ్యంగా పొగ, స్పార్క్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కళ్లు మూసుకోవాలి. కొన్నిసార్లు పొగవల్ల కళ్లు దురదపెట్టడం, మంట కలగడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో కళ్లను అస్సలు రబ్ చేయకూడదు. మీరు కళ్లను పట్టుకోవాలనుకుంటే కచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. క్రాకర్స్ కాల్చేప్పుడు కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకోకపోవడమే మంచిది. ఐ డ్రాప్స్‌ని దగ్గర్లో పెట్టుకుంటే మంచిది. ఇది కంటిలో ఇరిటేషన్ను తగ్గించి రిలీఫ్‌ని ఇస్తుంది. దీపావళి సమయంలో కంటిలో కెమికల్ బర్న్స్, రెటీనాల్ డ్యామేజ్, కండ్లకలక వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
అత్యవసర జాగ్రత్తలు..
పొరపాటున కళ్లల్లో స్పార్క్స్, కెమికల్స్ పడినట్లు అనిపిస్తే.. వెంటనే కళ్లను నీటితో కడిగేయండి. వెంటనే సొంత వైద్యం కాకుండా.. వైద్యులను సంప్రదిస్తే మంచిది. సొంత ట్రీట్మెంట్తో కంటిచూపును కూడా కోల్పోవచ్చు. కంటిలో నొప్పి, కళ్లు మసకగా మారిన, కంటిలో ఎరుపుదనం పెరిగినా.. కంటినుంచి కంటిన్యూగా నీరు వస్తున్నా.. వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి. అప్పుడే కంటిని కాపాడుకోగలిగినవారవుతారు.
ఫాలో అయితే మంచిది..
క్రాకర్స్ కాల్చుకుండా దీపాలతోనే దీపావళి చేసుకోవచ్చు. లేదంటే క్రాకర్స్ కాల్చితే.. కంటికి అడ్డంగా ఏమైనా పెట్టుకోవడం లేదంటే కళ్లద్దాలు పెట్టుకోవాలి. క్రాకర్స్ బయట ఎక్కువగా కాలుస్తుంటే.. ఇంట్లోనుంచి బయటకు రాకపోవడమే మంచిది. అలాగే ప్రమాదాలు జరిగితే.. ఇబ్బంది పడకుండా ఎమర్జెన్సీ నెంబర్స్ పెట్టుకోవాలి.
దీపావళికి వెలిగించే కొవ్వొత్తులు, దీపాలను కదలని ప్రాంతాల్లో ఉంచితే మంచిది. గోడమీదనో.. నేలమీదనో వాటిని ప్లేస్ చేయాలి. హీట్ రెసిస్టెన్సీ ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిది. త్వరగా అంటుకునే వస్తువులు, క్రాకర్స్‌ను దీపాలకు దూరంగా ఉంచాలి. దీపాలు, ఇతర క్రాకర్స్ వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేతికి వేడితాకి.. వాటిని విసేరయడం లాంటివి చేస్తే.. ప్రమాదాలు మరింత ఎక్కువగా ఉంటాయి.
Also Read : దీపావళి 2024 శుభాకాంక్షలను ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇలా చెప్పేయండి.. సోషల్ మీడియాలో షేర్ చేసేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
