Bihar Election 2025 Exit Poll Results | బీహార్‌లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్‌లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
అందరూ ఊహించినట్లుగా ఆర్జేడీ మాయాజాలం పనిచేయలేదు. కాంగ్రెస్ సత్తా చాటలేదు. చిన్న చితకా పార్టీలన్నీ కలిసి మహా ఘట్ బంధన్ గా వచ్చినా ఎన్డీయే కూటమి పీఠాన్ని కదల్చేరని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బిహార్ లో రెండో దశ పోలింగ్ ముగిసిన కాసేపటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి ప్రారంభం కాగా...ప్రఖ్యాత సర్వేలన్నీ బీజేపీ-జేడీయూ-ఎల్జేపీఆర్ కూటమికే పట్టం కట్టాయి. మార్టిజ్ IANS, చాణక్య సర్వే, పీపుల్స్ పల్స్, ప్రజాపోల్ ఎనల్టిక్స్ ఇలా ఎవ్వరి ఎగ్జిట్ పోల్స్ చూసినా బిహార్ ఎన్డీయే కూటమిదే మళ్లీ అధికారం అని చెబుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 140-180 స్థానాలు కనీసం గెలుచుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ సరాసరి చెబుతుండగా...మహా ఘట్ బంధన్ 30-60 సీట్లలోపే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ సరాసరిగా చెబుతున్నాయి. అసలు ఎన్నికల ఫలితాలు ఈనెల 14న విడుదల కానుండగా..ఎగ్జిట్ పోల్స్ హవా రిజల్ట్స్ లోనూ రిఫ్లెక్ట్ అయితే నితీశ్ కుమార్ పదోసారి బిహార్ ముఖ్యమంత్రి కావటం ఖాయంగా కనిపిస్తోంది.






















