Shooting at bride: పెళ్లి మండపంలోనే పెళ్లికూతుర్ని కాల్చేసిన ఉన్మాది - ఏ సినిమా చూశాడో ?
Bihar: పెళ్లి వేడుకలో దండలు మార్చుకుంటున్న యువతిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. రెండేళ్లుగా వన్ సైడ్ లవ్ లో ఉన్నాడు.. తన ప్రేమను అంగీకరించలేదని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Man shot Bride on stage at wedding: బీహార్‌లోని బక్సర్ జిల్లాలో పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న ఈ భయంకరమైన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీహార్‌లోని బక్సర్ జిల్లా చౌసా నగర్ పంచాయితీలో ఫిబ్రవరి 24, 2026 రాత్రి ఒక పెళ్లి వేడుక రక్తసిక్తమైంది. 18 ఏళ్ల ఆర్తీ కుమారి తన పెళ్లి వేడుకలో వరుడితో కలిసి దండలు మార్చుకోవడం కార్యక్రమం పూర్తి చేసి స్టేజీపై కూర్చుని ఉండగా, ఒక్కసారిగా ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి ఆమెపై కాల్పులు జరిపాడు. పెళ్లి సంగీతం హోరులో మొదట ఎవరికీ ఏమీ అర్థం కాలేదు, కానీ ఆర్తీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆమెను వెంటనే వారణాసిలోని ఆస్పత్రికి తరలించారు, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
వన్ సైడ్ ప్రేమలో ఉన్మాదం
ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని ఆమె పొరుగునే ఉండే దీనబంధు గా గుర్తించారు. నిందితుడు గత రెండేళ్లుగా ఆర్తీని ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడని, ఆమె నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో కూడా ఆమెకు సంబంధం కుదిరినప్పుడు, ఆ పెళ్లి కొడుకును బెదిరించి పెళ్లిని చెడగొట్టాడని సమాచారం. ఈసారి ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే ఉన్మాదంతో, ముఖానికి మాస్కు ధరించి వచ్చి అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపాడు.
పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరడి కుటుంబం
ఈ ఘటన జరిగిన వెంటనే వరుడి తరపు బంధువులు షాక్‌కు గురయ్యారు. తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందనే భయంతో వారు వివాహాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. మాకు ఇలాంటి గొడవలు ఉన్నాయని తెలిస్తే అసలు వచ్చేవాళ్లమే కాదు అని వారు స్పష్టం చేశారు. దీంతో ఆర్తీ జీవితం ఒక్కసారిగా అంధకారమైంది. ఒకవైపు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే, మరోవైపు ఆమె కట్టుకోవాల్సిన మూడు ముళ్ల బంధం మధ్యలోనే తెగిపోయింది.
🚨What is going on in Bihar? Criminals have become so emboldened that they even shoot the bride on stage at weddings and then escape!
— 𝑺𝒖𝒎𝒊𝒕 𝑺𝒊𝒏𝒈𝒉 𝑹𝒂𝒋𝒑𝒖𝒕 (@BeingSumit007) February 25, 2026
A deranged young man shot the bride during a wedding ceremony in Buxar district!@Buxarpolice Please let me know what action you have taken so… pic.twitter.com/SyPMTwCpEK
తండ్రి ఆవేదన
కన్నీరుమున్నీరవుతున్న ఆర్తీ తండ్రి నంద్ చౌదరి మాటలు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి. నా కూతురు ఆ నిందితుడిని ఇష్టపడలేదు, అందుకే వాడు కాల్పులు జరిపాడు. ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఒకవేళ తను బతికినా, రేపు పొద్దున ఎవరు వచ్చి తనను పెళ్లి చేసుకుంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిందితుడు దీనబంధు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని బక్సర్ ఎస్పీ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు





















