చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?
ముల్లంగిని ఇష్టపడే వాళ్లు తక్కువే. కానీ ఆరోగ్యం కోసం తినాల్సిందే.
ముల్లంగిని తినేవారు చాలా తక్కువ. రుచిపరంగా చూసుకుంటారు కానీ, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆ కూరగాయను కచ్చితంగా తినాలి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని తింటారు. సీజనల్‌గా వచ్చే వ్యాధులను తట్టుకోవాలంటే కచ్చితంగా అన్ని రకాల కూరగాయలను తినాలి.అలాగే చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే ముల్లంగిని కచ్చితంగా తినాల్సిందేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ముల్లంగి చలికాలంలో తినడం వల్ల కలిగే ప్రయోజనాలును వివరిస్తున్నారు.
ఆ రోగాలు రాకుండా...
ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జలుబు, దగ్గు రాకుండా అడ్డుకుంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది. ఇది పోషకాలతో సమృద్ధిగా నిండి ఉంటుంది. పోషకాహార నిపుణులు దీన్ని సూపర్ ఫుడ్ జాబితాలోనే ప్రస్తావిస్తారు. దీన్ని ‘మూలి’ అని కూడా పిలుస్తారు. ఇది పిండి పదార్థాలు, కొవ్వులను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది. ఇందులో పొటాషియం,ఫాస్పేట్ అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందులో నిండుగా పొటాషియం ఉంటుంది. దీని వల్ల అధిక రక్తపోటు తగ్గి, రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ముల్లంగి చాలా మేలు చేస్తుంది. దీనిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. కాబట్టి వారు ముల్లంగిని తరచూ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
అందానికి...
అందానికి కూడా ముల్లంగి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై మొటిమలు రావడం, పొడి చర్మం, దద్దుర్లును నివారిస్తుంది. అలాగే జుట్టు ఆరోగ్యవంతంగా ఎదిగేలా చేస్తుంది. చుండ్రును తొలగించి, జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. చర్మం మెరవాలంటే వారానికి రెండు సార్లయినా ముల్లంగి తింటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారికి ముల్లంగి మంచి ఔషధం అనే చెప్పాలి. మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరం నుంచి అన్ని హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది.
క్యాన్సర్ చికిత్స
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇందులో ఉండే ఫినాలిక్ రసాయనాలు క్యాన్సర్ నివారణకు సాయపడుతుంది. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ తగ్గేలా చేస్తుంది. దీనిలో ఉండే నైట్రోసమైన్ క్యాన్సర్ కారకాల పెరుగులను అడ్డుకుంటుంది.
కాబట్టి రుచి గురించి పట్టించుకోకుండా ముల్లంగిని వారానికి రెండు సార్లు తినడం చాలా అవసరం.
Also read: ఈ సంకేతాలు కనిపిస్తే మీకు మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చినట్టే, జాగ్రత్త పడండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.