News
News
X

Holi 2023: హోలీ రోజు భంగ్ ఎందుకు తాగుతారు? ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడటం ఎలా?

హోలీ రోజున ఖచ్చితంగా భంగ్ తాగి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. మరి తర్వాత దాని వల్ల వచ్చే తలనొప్పి పరిస్థితి ఏంటి? దాని నుంచి ఎలా బయటపడాలంటే..

FOLLOW US: 
Share:

జీవితంలో సంతోషం, రంగులు నింపేందుకు వచ్చేసింది హోలీ పండుగ. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ రంగులు పూసుకుంటూ పాటలకు డాన్స్ చేస్తూ ఆనందడోలికల్లో మునిగితేలుతారు. హోలీ రోజు చాలా మంది స్పెషల్ డ్రింక్ భంగ్ తాగకుండా ఉండరు. ప్రత్యేకంగా హోలీ రోజున దీన్ని తయారుచేసుకుని తాగడం సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ భంగ్ వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ భంగ్ ని ప్రతి ఒక్కరూ హోలీ రోజున తప్పకుండా తాగుతారు.

భంగ్ చరిత్ర

శివునికి ఎంతో ఇష్టమైన ఆహారం భంగ్. అందుకే ఆ మహాదేవుడ్ని 'లార్డ్ ఆఫ్ భంగ్' అని కూడా పిలుస్తారు. ఒక పురాణం ప్రకారం దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒకరోజు శివుడు తన కుటుంబంతో గొడవపడి పొలాల్లోకి పరిగెత్తాడు. అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. కాసేపటికి మెలుకువ వచ్చిన తర్వాత ఆ చెట్టు ఆకులు నమిలాడు. ఆ మొక్క మరేదో కాదు భంగ్. అది తిన్న తర్వాత శివుడికి ఉత్సాహంగా అనిపించింది. అలా భంగ్ శివునికి ప్రీతిప్రాతమైన ఆహారంగా మారిందని చెప్తుంటారు.

హోలీ రోజు ఎందుకు తీసుకుంటారు?

హోలీ రోజు తప్పనిసరిగా చాలా మంది భంగ్ తీసుకుంటారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది కూడా. భంగ్ ని గంజాయి ఆకులు కలిపి చేస్తారు. ఇది ఔషధ గుణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు. పండుగ స్పూర్తిని పెంచుతుందని అంటారు. అందుకే దీన్ని తీసుకుంటారు. మత్తుగా ఉండే ఈ పానీయం తాగిన మరుసటి రోజు హ్యాంగోవర్ అని తలలు పట్టేసుకుంటారు. ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది.

భంగ్ హ్యాంగోవర్ నుంచి బయట పడేసే చిట్కాలు 

హైడ్రేట్: నీరు పుష్కలంగా తాగడం వల్ల భంగ్ హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే భంగ్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది హ్యాంగోవర్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం, వ్యర్థాలను బయటకి పంపడం కోసం నీరు బాగా తాగాలి.

ఆరోగ్యకరమైన భోజనం తినాలి: పౌష్ఠికాహారం తినడం వల్ల భంగ్ తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి పొందేలా చేస్తుంది. పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్ వంటి విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించాలి.

విశ్రాంతి: భంగ్ హ్యాంగోవర్ నుంచి శరీరం కోలుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. వీలైతే మరుసటి రోజు సెలవు పెట్టి రోజంతా విశ్రాంతి తీసుకుంటే మంచిది. ఇది శరీరాన్ని రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

కెఫీన్, ఆల్కహాల్ వద్దు: కెఫీన్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల భంగ్ హ్యాంగోవర్ మరింత తీవ్రమవుతుంది. కెఫీన్ నిర్జలీకరణానికి కారణమవుతుంది. ఆల్కహాల్ మీ మెదడు పనితీరుని మరింత దెబ్బతీస్తుంది. అందుకే ఈ పానీయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

వెచ్చని నీటితో స్నానం: వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహకరిస్తుంది. నరాలను శాంతింపజేస్తుంది. భంగ్ హ్యాంగోవర్ తో సంబంధం ఉన్న తలనొప్పి, ఒళ్ళు నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే భంగ్ మితంగా మాత్రమే తీసుకోవాలి లేదంటే అనారోగ్యాల పాలవుతారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: ఈ ఒక్క జ్యూస్ తాగారంటే చాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా

Published at : 07 Mar 2023 11:51 AM (IST) Tags: holi Holi special drink Bhang Bhang Gangover Tips To Overcome Hangover

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

టాప్ స్టోరీస్

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

పేర్ని నాని, వసంత కృష్ణ ప్రసాద్ అంతలా తిట్టుకున్నారా? అసలేం జరిగింది?

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!

Honda Shine 100: రూ.65 వేలలోపే 100 సీసీ బైక్ - హోండా షైన్ కొత్త వేరియంట్ గురించి ఐదు ఇంట్రస్టింగ్ విషయాలు!