అన్వేషించండి

Carrot Juice: ఈ ఒక్క జ్యూస్ తాగారంటే చాలు అందంతో పాటు ఆరోగ్యం కూడా

క్యారెట్లు తిన్నా వాటితో జ్యూస్ చేసుకుని తాగినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు.

ఆరెంజ్ కలర్ లోని క్యారెట్ అందాన్ని మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తుంది. దానికి ఉన్న రంగు అందరినీ ఆకర్షించేస్తుంది. ఇది తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజుకొక క్యారెట్ తింటే అనేక అనారోగ్య సమస్యలను దూరం పెట్టేయవచ్చని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంటువ్యాధులు, అనారోగ్యాల నుంచి రక్షణగా నిలుస్తాయి. క్యారెట్ తినలేకపోతే చక్కగా జ్యూస్ చేసుకుని తాగొచ్చు.

క్యారెట్లు కళ్ళకు చాలా మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ప్రతిరోజు తిన్నా కూడా కేలరీల సంఖ్య పెద్దగా పెరగదు. ఇందులో విటమిన్ ఏ, సి, అధిక మొత్తంలో కె ఉన్నాయి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడే లూటీన్, జియాక్సంతిన్ అనే కెరోటినాయిడ్ పిగ్మెంట్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే క్యారెట్ జ్యూస్ ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇవి..

కళ్ళకు మంచిది

క్యారెట్ లో ఉండే వివిధ పోషకాల కారణంగా కళ్ళకు మేలు చేస్తుందని అంటారు. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. కళ్ళకు ఎంతో అవసరమైన విటమిన్ ఇది. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ కాంతి వల్ల కళ్ళు దెబ్బతినకుండా కాపాడుతుంది. క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల వయసు సంబంధిత మచ్చలు, ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి

కూరగాయలు శరీరానికి చాలా ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే వాటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తి బలపడేందుకు సహకరిస్తాయి. విటమిన్, ఏ, సి రోగనిరోధక వ్యవస్థని పెంచడంలో సహాయపడే కీలకమైన వాటిని క్యారెట్ అందిస్తుంది. ఫ్రీ ర్యాడికల్స్ డ్యామేజ్ ని నివారిస్తుంది.

షుగర్ లెవల్స్ అదుపులో

మధుమేహంతో బాధపడే వాళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూస్తాయి. క్యారెట్ జ్యూస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పదార్థం. అందుకే డయాబెటిక్ రోగులకు చాలా మంచి ఎంపిక. ఇదే కాదు గట్ లో మంచి బ్యాక్టీరియా ప్రేరేపించడానికి సహాయపడుతుంది.

చర్మానికి మంచిది

క్యారెట్ రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులోని కెరొటీనాయిడ్స్ సూర్యుని UV కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది.

కాలేయానికి మంచిది

యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, కెరొటీనాయిడ్స్ ఉన్నాయి. ఇవి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) నుంచి కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ని నిరోధిస్తుంది

క్యాన్సర్ కణాల పురోగతిని మందగించేలా చేయడంలో క్యారెట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కు కారణమయ్య ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. క్రమం తప్పకుండా క్యారెట్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కాఫీ ఇలా తాగారంటే మెదడు మటాష్! రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగాలంటే..

టాప్ హెడ్ లైన్స్

Viral News: హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
హాయిగా నిద్రపోయి 9.6 లక్షలు గెలిచిన యువతి.. మీరూ ట్రై చేయవచ్చు
Blood Pressure Risks : ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
ఉప్పు ఒక్కటే కాదు.. ఈ రోజువారీ అలవాట్లు కూడా బీపీని పెంచుతాయి, జాగ్రత్త
Weight Loss Drinks : బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
బ్రేక్‌ఫాస్ట్‌కు టైమ్ లేదా? ఈ సింపుల్ స్మూతీలు ట్రై చేయండి.. బరువు తగ్గేందుకు హెల్ప్ కావచ్చు
Diwali Cleaning Tips : దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
దీపావళి హోమ్ క్లీనింగ్ చెక్ లిస్ట్.. ఈజీగా, ఎఫెక్టివ్​గా శుభ్రం చేయాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget