Salt Intake : ఉప్పును నెలరోజులు మానేస్తే కలిగే ప్రయోజనాలేంటి? నష్టాలున్నాయా? రోజుకి ఎంత తీసుకోవాలంటే
Stop Eating Salt for 30 Days : ఉప్పు లేకుంటే ఏ పదార్థమైనా అంతగా రుచించదు. అసలు ఉప్పు తినడాన్నే మానేస్తే ఏమవుతుంది? దీనివల్ల లాభాలున్నాయా? నష్టముందా?
Effects of Quitting Salt for 30 Days : వంటల్లో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటాదట ఉప్పు. అసలు ఉప్పు లేకుంటే ఏ ఫుడ్‌ని అయినా తినడం ఇబ్బందిగానే ఉంటుంది. పైగా వంటల్లో రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే వచ్చే రుచి అమోఘమనే చెప్పవచ్చు. ఉప్పు లేకుండా ఫుడ్స్ తినడం అంటే సాహసం అనే చెప్పాలి. అలాంటి ఉప్పును నెల రోజులు తినడం మానేస్తే? ఊహిస్తే భయంకరంగానే ఉంటుంది కానీ.. ఉప్పును మానేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయట. అలాగే శరీరానికి ఎన్నో నష్టాలున్నాయట.. మరి ఉప్పును తీసుకోవడం మానేయాలా? లేదంటే ఉప్పును తింటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయోజనాలివే..
ఉప్పును నెలరోజులు తీసుకోవడం మానేయడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. సోడియం ఫ్రీ డైట్ బీపీని తగ్గిస్తుంది. శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. ఉప్పు మానేయడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. కిడ్నీలు మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ప్రతికూల ప్రభావాలివే..
ఉప్పు తీసుకోకపోవడం వల్ల లాభాలే కాదు.. కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఉప్పును నెలరోజులు మానేయడం వల్ల ఫటిగో వంటి లక్షణాలు పెరుగుతాయి. ఇది నీరసాన్ని పెంచవచ్చు. సోడియం లెవెల్స్ తగ్గడం వల్ల కళ్లు తిరగడం వంటివి జరుగుతాయి. కండరాలపై ప్రభావం చూపించి.. నొప్పులు పెరుగుతాయి. శరీరం డీహైడ్రేట్ అవుతుంది. హార్మోనల్ సమస్యలు కూడా పెరుగుతాయి.
మరిన్ని సమస్యలు
ఉప్పు లేకుండా ఫుడ్‌ని తినడం చాలా కష్టం. కాబట్టి నోటికి ఏ ఫుడ్ అంతగా రుచించదు. అలాగే డీహైడ్రేషన్ వల్ల చర్మం డ్రై అయిపోతుంది. జుట్టు పెరుగుదలపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉప్పు మానేయాలనుకున్నప్పుడు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి. శరీరంలో సోడియం లెవెల్స్, బీపీ లెవెల్స్‌ని రెగ్యూలర్‌గా చెక్ చేసుకోవాలి. ఉప్పును ఒకేసారి మానేయడం కంటే.. తగ్గించుకుంటూ వెళ్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు.
రోజు ఎంత తీసుకోవాలంటే..
ఉప్పు వాడకాన్ని ఎక్కువ చేస్తే కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయి. మానేస్తే కూడా హెల్త్‌కి ఇబ్బందులు ఎదురవుతాయి. మరి దీనిని రోజుకు ఎంత తీసుకుంటే మంచిది అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రోజుకు 1 టీస్పూన్ ఉప్పు తీసుకుంటే మంచిదని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే రోజుకు 2,000 mg (0.8 tsp) తీసుకుంటే మంచిదని వెల్లడించింది.
ఉప్పును మానేయాలనుకుంటే..
ఉప్పును మానేయాలనుకునేవారు.. పూర్తిగా మానేయడం కాకుండా వాటికి ఆల్ట్రనేటివ్స్ని చూసుకుంటే మంచిది. ఉప్పునకు బదులు హిమాలయన్ పింక్ సాల్ట్, సముద్రపు ఉప్పు, హెర్బల్ బేస్డ్ ఉప్పు, లెమన్ జ్యూస్ వంటి వాటిని తీసుకోవచ్చు. వీటి వల్ల బీపీ కంట్రోల్ ఉంటుంది. పైగా వంటలు రుచిగా ఉంటాయి. లేదంటే ఉప్పును పూర్తిగా మానేయడం కాకుండా.. తక్కువగా తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి.
Also Read : మధుమేహం వచ్చే ప్రమాదం వారికే ఎక్కువ.. రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు, వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే