అన్వేషించండి

World Diabetes Day 2024 : మధుమేహం వచ్చే ప్రమాదం వారికే ఎక్కువ.. రాకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు, వస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే

Diabetes Precautions : మధుమేహం దేనివల్ల వస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వస్తే ఎలా ఉండాలి? చికిత్స తీసుకోకుంటే జరిగే నష్టాలేమిటో ఇప్పుడు చూసేద్దాం. 

World Diabetes Day 2024 Prevention Tips : మధుమేహంపై అవగాహన కల్పిస్తూ.. ఏటా నవంబర్ 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఈ సమస్యపై అందరూ అవగాహన కలిగి ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండియాలో కూడా డయాబెటిస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. 2023లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 10.1 కోట్ల మందికి మధుమేహం ఉందని తేలింది.

అందుకే ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు ఏటా ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా డయాబెటిస్​పై పూర్తి అవగాహన కల్పిస్తారు. అసలు మధుమేహ నివారణ ఎలా చేయాలి? రోగనిర్ధారణ, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకువాలి? రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి.. మధుమేహాన్ని ట్రిగర్ చేసే అంశాలేంటి.. ప్రపంచ మధుమేహ దినోత్సవం థీమ్ ఏంటి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

ఈ ఏడాది థీమ్ ఇదే.. 

మధుమేహ నివారణ కోసం.. ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ దినోత్సవం రోజు ఓ థీమ్​ని ఫాలో అవుతూ ఉంటారు. అలాగే 2024కు గానూ.. బ్రేకింగ్ బారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్ అనే థీమ్​తో వచ్చారు. దీనిలో భాగంగా మధుమేహ సంరక్షణలో అసమానతలను పరిష్కరించడానికి.. ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు సహకారం అందించడమే లక్ష్యంగా ముందుకు రావాలనేది దీని ఉద్దేశం. ఈ థీమ్ వల్ల డయాబెటిస్ ప్రమాద కారకాలు తగ్గించడమే కాకుండా.. సమస్యతో ఇబ్బంది పడేవారికి మద్ధతు అందించాలని సూచిస్తుంది. 

మధుమేహం.. 

ప్యాంక్రియాస్ ద్వారా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే.. లేదా ఇన్సులిన్ ఉత్పత్తిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవడాన్నే మధుమేహం అంటారు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరం. సరైన ఇన్సులిన్ పనితీరు లేకుంటే రక్తంలో చక్కెర అదుపు లేకుండా పెరిగిపోతుంది. దీనినే హైపర్​ గ్లైసీమియా అంటారు.

మధుమేహ లక్షణాలు 

మధుమేహం శరీర వ్యవస్థలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. టైప్​ 2 డయాబెటిస్​ ఉంటే.. దానిని గుర్తించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. దాహం పెరగడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, దృష్టి లోపాలు, అలసట, రీజన్​ లేకుండా బరువు తగ్గడం వంటివి మధుమేహం లక్షణాలే. 

చికిత్స తీసుకోకుంటే.. 

మధుమేహం ఉందని తెలిసిన వెంటనే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే.. ఇది గుండె, కళ్లు, మూత్రపిండాలు, నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అవయవాలలో రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల గుండెపోటులు, స్ట్రోకులు, కిడ్నీల వైఫల్యం వంటి ప్రమాదాలు సంభవిస్తాయి. రెటీన్ రక్తనాళాలు దెబ్బతిని శాశ్వతంగా కంటిచూపును కోల్పోవాల్సి వస్తుంది. నరాలు దెబ్బతిని.. పాదాలలో రక్త ప్రసరణ తగ్గుతుంది. అల్సర్​ వచ్చే ప్రమాదం కూడా ఉంది. 

ఎవరికి వచ్చే ప్రమాదముందంటే.. 

టైప్ 1 డయాబెటిస్.. జెనిటిక్స్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి, పెరిగే వాతావరణ వల్ల వస్తుంది. మధుమేహాన్ని కొన్ని కారకాలు ప్రేరేపిస్తాయి. ముఖ్యంగా ఫ్యామిలీలో మధుమేహం ఉంటే.. మిగిలినవారికి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఒబెసిటీ, శారీరక శ్రమ లేకపోవడం, అన్​ హెల్తీ డైట్ ఫాలో అవ్వడం, వారసత్వం, వయసు 45 దాటినవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశముంది. 

ఎలా నివారించాలంటే.. 

టైప్ 2 డయాబెటిస్​ను నివారించడానికి లేదా దూరం చేసుకోవడానికి హెల్తీ లైఫ్​ స్టైల్​ను ఫాలో అవ్వాలి. మందులు, వైద్యుల సూచనలతో పాటు ఆరోగ్యకరమైన బరువు ఉండడం.. ప్రతిరోజూ అరగటం వ్యాయామం చేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం చేయాలి. స్వీట్స్, అన్​ హెల్తీ ఫ్యాట్స్​కి దూరంగా ఉండాలి. స్మోకింగ్​ పూర్తిగా మానేయాలి. డ్రింకింగ్​కి దూరంగా ఉండాలి. హెల్తీ డైట్​ తీసుకోవాలి. వీటిని ఫాలో అవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ దూరమవుతుంది. 

Also Read : పరగడుపునే ఈ కషాయం తాగితే చాలా మంచిదట.. షుగర్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Embed widget