అన్వేషించండి

Morning Drink : పరగడుపునే ఈ కషాయం తాగితే చాలా మంచిదట.. షుగర్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతాయట

Turmeric Drink : పసుపుతో చేసే కషాయాన్ని తాగితే అందానికి, ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట. మరి ఈ డ్రింక్ ఎలా చేయాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? 

Healthy Drink : ఉదయాన్నే పసుపుతో కషాయాన్ని(Turmeric Drink) చేసుకుని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆయుర్వేద నిపుణులు. శారీరక ప్రయోజనాలే కాకుండా.. మానసికంగా కూడా బెనిఫిట్స్ సొంతమవుతాయంటున్నారు. అలాగే స్కిన్, హెయిర్​కి కూడా మంచిదని చెప్తున్నారు. పైగా దీనిని తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదట. చాలా సింపుల్​గా ఇంట్లో దీనిని చేసుకోవచ్చు. మరి ఈ కషాయం వల్ల కలిగే లాభాలు ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఎలా ప్రిపేర్ చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

శారీరక ప్రయోజనాలు.. 

పసుపులో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, శరీరంలో మంట, వాపును దూరం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. సీజనల్ వ్యాధులు రాకుండా.. ఫ్లూ ఇన్​ఫెక్షన్లను దగ్గరకు రాకుండా చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. లివర్, కిడ్నీ సమస్యలను దూరం చేసి హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

మధుమేహమున్నవారు తీసుకోవచ్చా?

దీనిని మధుమేహమున్నవారు కూడా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్​ను కంట్రోల్ చేసి.. అదుపులో ఉంచుతుంది. కాబట్టి ఈ డ్రింక్ మధుమేహమున్నవారు కూడా హాయిగా తీసుకోవచ్చు. 

అందానికై.. 

ఈ డ్రింక్​ని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే.. చర్మానికి, జుట్టుకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది స్కిన్​కి మంచి గ్లోని ఇస్తుంది. పింపుల్స్​ని తగ్గిస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు కూడా దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు. ఇది జుట్టు ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. 

మానసిక ప్రయోజనాలు.. 

ఈ కషాయం వల్ల మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఒత్తిడి, యాంగ్జైటీ ఉన్నవారు ఈ డ్రింక్ రెగ్యూలర్​గా తీసుకుంటే.. మంచి ఫలితాలుంటాయి. మీ మూడ్ ఎన్​హాన్స్ అవుతుంది. ఒత్తిడినుంచి దూరం చేసి.. కంగారు తగ్గిస్తుంది. దీనివల్ల పనిపై ఫోకస్ పెరుగుతుంది. డే అంతా యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. 

ఎలా తయారు చేయాలంటే.. 

పసుపు కొమ్మును నీటిలో వేసి మరిగించి.. దానిని వడకట్టి తాగాలి. దానిలో నిమ్మరసం, తేనె లేదా అల్లం కూడా వేసుకుని తాగవచ్చు. ఇవి ఆప్షనల్ మాత్రమే. పసుపు కొమ్ము అందుబాటులో లేకుంటే.. ఓ గ్లాసు నీటిని వేడి చేయాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో టీస్పూన్ పసుపు వేసుకుని తాగాలి. ఈ డ్రింక్​ని రెగ్యూలర్​గా తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. బ్రేక్​ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు దీనిని తాగితే మరీ మంచిది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

ఈ డ్రింక్​ని మీరు తాగాలనుకుంటే.. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోండి. అలాగే మొదటిసారి ఈ డ్రింక్ ప్రారంభించేప్పుడు పసుపును తక్కువ మోతాదులో శరీరానికి అలవాటు చేయాలి. అంటే మరీ 1 టీస్పూన్ కాకుండా పావు టీస్పూన్, అర టీస్పూన్ అలా పెంచుకోవాలి. టీస్పూన్​ పరిమితి చాలు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. దీని రుచి పెంచుకోవడానికి అల్లం, దాల్చిన చెక్క వంటివాటిని కూడా వేసి తయారు చేసుకోవచ్చు. ఇదే కాకుండా హెల్తీ రోటీన్​ను ఫాలో అయితే మరిన్ని మంచి ప్రయోజనాలు పొందవచ్చు. 

Also Read : ఈ డైట్ ఫాలో అయితే మధుమేహానికి మందులు ఉపయోగించాల్సిన అవసరం లేదట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలివే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు,  హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Parvathipuram Elephants Hulchul | భవన నిర్మాణ కార్మికులను వణికించిన ఏనుగులు | ABP DesamKappatralla Uranium News | రోడ్డుపై బైఠాయించిన కప్పట్రాళ్ల గ్రామస్థులు | ABP DesamHamas Leader Killed In Israel Attack | హమాస్ కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయేల్ | ABP Desamమహిళలు ఒకరి మాటలు వినకూడదు, తాలిబన్ల వింత రూల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్
CM Chandrababu: 'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
'రాష్ట్ర భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక' - సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Black OTT Review: బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
బ్లాక్ సినిమా రివ్యూ: సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్‌తో జీవా ‘బ్లాక్’బస్టర్ - ఓటీటీలో రిలీజ్ - సినిమా ఎలా ఉంది?
Embed widget