అన్వేషించండి

Reverse type 2 diabetes : ఈ డైట్ ఫాలో అయితే మధుమేహానికి మందులు ఉపయోగించాల్సిన అవసరం లేదట.. న్యూ స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయాలివే

Benefits of Low Carb Diet for Type 2 Diabetes : డైట్​లో కొన్ని మార్పులు చేస్తే.. టైప్ 2 డయాబెటిస్​ దూరమవుతుందట. మందులు వాడాల్సిన అవసరం కూడా రాదంటోంది తాజా అధ్యయనం. ఎలా అంటే..

Low Carb Diet and Type 2 Diabetes : మధుమేహముంటే ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పైగా మధుమేహముంటే రెగ్యూలర్​గా మందులు తీసుకోవాలి. కానీ లో కార్బ్ డైట్ తీసుకుంటే.. టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ అయిపోతుందని అంటోంది తాజా అధ్యయనం. మధుమేహానికి ఉపయోగించే మందులను కూడా మానేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క డైట్​తో ఇంత మంచి ప్రయోజనాలు ఉంటాయా? కొత్త అధ్యయనంలో ఎలాంటి విషయాలు బయటకొచ్చాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

టైప్ 2 డయాబెటిస్​ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మందులను ఉపయోగిస్తారు. అయితే ఏది ఏమైనా.. ఆహారంలో మార్పులు తీసుకుంటే.. ముఖ్యంగా లో కార్బ్ డైట్ తీసుకుంటే.. మందులు వాడాల్సిన అవసరం రాదట. టైప్ 2 డయాబెటిస్​ ఉన్నవారిలో లో-కార్బ్ డైట్ తీసుకోవడం వల్ల బీటా సెల్ పనితీరు గణనీయమైన మార్పులు జరిగాయని తాజా అధ్యయనం తెలిపింది. దీనివల్ల డయాబెటిస్ సమర్థవంతంగా తగ్గించడంతో పాటు.. దానిని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుందని గుర్తించారు. 

బీటా కణాలపై ఎలాంటి ప్రభావముంటుంది..

బీటాకణాలతో మధుమేహం ఎలా కంట్రోల్ అవుతుందనే ప్రశ్న అందరిలోనూ ఉంటంది. దీనిపై తాజా అధ్యయనం కూడా స్టడీ చేసింది. దానిలో ఏమి గుర్తించారంటే.. ప్యాంక్రియాస్​లో ఉన్న బీటా కణాలు.. ఇన్సులిన్​ను ఉత్పత్తి చేసి, విడుదల చేసి.. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తున్నట్లు తేలింది. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో గ్లూకోజ్​కి బీటా సెల్ ప్రతిస్పందించడం కాలక్రమేణా తగ్గిపోతుంది. దీనివల్ల వ్యాధిలో పురోగతి వస్తుందని గుర్తించారు. 

వారిపై పరిశోధన చేశారు..

ఈ అధ్యయనం గురించి జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలీజంలో రాసుకొచ్చారు. టైప్ 2 డయాబెటిస్​తో బాధపడుతున్న పెద్దలలో బీటా సెల్ పనితీరుపై లో కార్బ్ డైట్ మంచి ప్రభావాన్ని చూపిస్తుందని రాసుకొచ్చారు. ఈ స్టడీలో 35 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న పెద్దలు పాల్గొన్నారు. వారిలోని మధుమేహం ప్రకారం.. బాడీ మాస్ ఇండెక్స్ తెలుసుకుని.. ఇన్సులిన్ లేకుండా ఫుడ్ ఇచ్చారు. దీనిలో వచ్చిన ఫలితాలే ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేశాయి. 

ఆరోగ్య ప్రయోజనాలు

లో కార్బ్ డైట్ తీసుకుంటే శరీరంలో బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే బరువు తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి లో కార్బ్ డైట్ మంచి ప్రయోజనాలు అందిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. మంటను తగ్గించి.. చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్​లో ఉంటే.. గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. 

ఫాలో అవ్వాలనుకుంటే.. 

టైప్ 2 డయాబెటిస్​ను తగ్గించుకోవాలనుకుంటే.. కార్బోహైడ్రేట్స్​ తీసుకోవడం తగ్గించాలి. కూరగాయలు, మీట్, చేపలు, గుడ్లు, హెల్తీ ఫ్యాట్స్​పై ఫోకస్ చేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. షుగర్ డ్రింక్స్, వేయించిన పదార్థాలు.. స్టార్ట్ కూరగాయలను తీసుకోకపోవడమే మంచిది. కార్బోహైడ్రేట్స్​ని 50 నుంచి 150 గ్రాములు మాత్రమే రోజూ తీసుకోవాలి. మీరు తీసుకునే ఫుడ్​పై అవగాహన ఉంటే.. మంచి ఫలితాలుంటాయి. ఆకు కూరలు, బ్రోకలీ, నట్స్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉండే లోకార్బ్ ఫుడ్స్​ తీసుకుంటే మంచిది. 

Also Read : టాక్సిన్లను బయటకి పంపి, బరువు కంట్రోల్ చేసే డ్రింక్స్ ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Suchir Balaji: మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
మన సుచిర్ బాలాజీని అమెరికాలో చంపేశారా ? - మస్క్‌కీ డౌటే - ఎవరిపని ?
Allu Arjun - Shilpa Ravi Reddy: అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
అల్లు అర్జున్ ఫ్రెండ్ మిస్సింగ్... నంద్యాల శిల్పా రవి రెడ్డి ఎక్కడ?
Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ మాట ప్రకారం మాదిగలకు న్యాయం చేసి తీరుతాం- రేవంత్ రెడ్డి
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Embed widget