అన్వేషించండి

Silent Killer: కదలకుండా గంటలుగంటలు టీవీ చూసే వారికి హెచ్చరిక... ఆ సైలెంట్ కిల్లర్ చంపేయచ్చు

టీవీకి అతుక్కుని గంటలుగంటలు గడిపేవారికి షాకిచ్చే అధ్యయనం ఇది.

చాలా మంది వెబ్ సిరీస్‌లకు అలవాటు పడ్డారు. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి, పని పూర్తవ్వగానే టీవీ చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఇలా గంటలుగంటలు టీవీ చూస్తూ గడిపేవారిలో ఎప్పడైనా హఠాత్తుగా ‘ప్రాణాంతక పరిస్థితి’ తలెత్తే అవకాశం ఉంది. కొత్త పరిశోధన ప్రకారం సోఫాలో లేదా, మంచంపై కూర్చుని టీవీకి అతుక్కుపోయేవారిలో ‘సిరల త్రాంబోఎంబోలిజం’ (venous thromboembolism) కలిగే అవకాశం 35 శాతం ఉంది. ఇది ప్రాణాంతకంగా మారచ్చు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని పిలిచారు పరిశోధకులు. 

ఏంటీ సిరల త్రాంబోఎంబోలిజం?
కాలు, గజ్జలు, చేతుల్లో ఉండే సిరల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని సిరల త్రాంబోఎంబోలిజం అంటారు. సిరలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు. ఈ రక్తనాళాల్లో రక్తప్రవాహం మందగించినా, రక్తనాళాల లైనింగ్‌కు ఏదైనా నష్టం వాటిల్లినా, రక్తం గడ్డకట్టినా కూడా ఈ పరిస్థితి సంభవిస్తుంది. నిజానికి అరవై ఏళ్లు పైబడిన వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువ. ఇది వైకల్యానికి, కొన్ని సార్లు మరణానికి కూడా కారణమవుతుంది.  

టీవీ చూడడం వల్ల...
శాస్త్రవేత్తలు కదలకుండా కూర్చుని టీవీ చూడడం వల్ల జరిగే నష్టాలను తెలుసుకునేందుకు 2016 నుంచి 2021 మధ్య మూడు అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాలు అమెరికా, జపాన్లలో 1,31,400 మందిపై చేశారు. ఈ పరిశోధనలో రోజుకు రెండున్నర గంటల కంటే తక్కువ సమయం టీవీ చూసే వారి కంటే రోజుకు నాలుగ్గంటల కంటే ఎక్కువ సమయం టీవీ చూసే వారిలో సిరల త్రాంబోఎంబోలిజం వచ్చే అవకాశం అధికంగా ఉన్నట్టు తేలింది. అలాగని టీవీ చూడడం హానికరమని కాదు, అలా కదలకుండా ఎక్కువసేపు కూర్చుని చూడడమే హానికరంగా మారుతోంది. కేవలం టీవీ చూసేటప్పుడే కాదు, ఆఫీసు పని చేస్తూ కూడా  ఎక్కువ సేపు కదలకుండా పనిచేసే వారిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువేనని అంటున్నారు అధ్యయనకర్తలు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రవాహంలో చురుకుదనం తగ్గుతుందని, దీని వల్ల రక్తంలో గడ్డలు ఏర్పడే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. 

ప్రతి గంటకోసారి....
కూర్చున్న ప్రతిగంటకోసారి లేచి మూడు నిమిషాల వాకింగ్ చేయడం లేదా ఏదైనా వ్యాయామం చేయడం చాలా అవసరమని చెబుతున్నారు. ఇది అకాలమరణం కలిగే అవకాశాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. రోజుకు 11 నుంచి 12 గంటల పాటూ కూర్చునే వారికి రోజుకు గంట పాటూ వ్యాయామం చేయడం చాలా అవసరమని సూచిస్తున్నారు. 

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Also read: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు

Also read: ఆ రోగులలో కేవలం శ్వాసఆడకపోవడమే కాదు, ఇంకా ఎన్నో సమస్యలు ఉండే అవకాశం... చెబుతున్న కొత్త అధ్యయనం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP DesamUSA White House Special Features | వైట్ హౌస్ గురించి ఈ సంగతులు మీకు తెలుసా..? | ABP DesamUS Election Results 5 Reasons for Kamala Harris Defeat

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ponguleti: 'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
'త్వరలో ఆటంబాంబ్ పేలబోతోంది' - మరోసారి మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!
Vangalapudi Anitha: 'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Mancherial News: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
మద్యం తాగి వాహనం నడుపుతున్నారా? - ఇకపై ఆస్పత్రిలో శుభ్రత పనులు చేయాల్సిందే!, మంచిర్యాల కోర్టు వినూత్న తీర్పు
Embed widget