News
News
X

Kitchen: వంటగదిలో ఈ తప్పులు మీరు చేస్తున్నారా... ఆరోగ్యానికి ముప్పు తప్పదు

వంట చేసేటప్పుడు కొన్ని పదార్థాలు పచ్చిగా రుచి చూడడం కూడా ప్రమాదమే అంటున్నారు ఆహారనిపుణులు.

FOLLOW US: 

వంటింట్లో కొన్ని రకాల పనులు నిత్యం చేస్తుంటారు. అందుకే వాటిని వంటింటి అలవాట్లు అంటాం. కొన్నిరకాల వంటింటి అలవాట్లు మాత్రం దీర్ఘకాలంగా అనుసరించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. చాలా మందికి రుబ్బు లేదా పిండి కలిపాక ఉప్పు సరిపోయిందో లేదో చూడటానికి కాస్త రుచి చూస్తారు. ఇది వారంతో చాలా సార్లు జరిగే ప్రక్రియ. కానీ ఆ పచ్చి రుబ్బు లేదా పిండిని తినడం మంచిది కాదంటున్నారు ఆరోగ్యనిపుణులు. దానివల్ల సాల్మోనెల్లా అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు మాంసాహారం, కూరగాయలు కోసేందుకు వేర్చేరు చాపింగ్ బోర్డులు కూడా ఉపయోగించాలి. కానీ చాలా మంది అదే బోర్డు మీద కోస్తారు. దీనివల్ల మాంసాహారం దానికి అతుక్కుని ఉండిపోతుంది. అక్కడ వైరస్ లు, బ్యాక్టిరియాలు చేసే చేరుతాయి. అవన్నీ సూక్ష్మ రూపంలోనే ఉంటాయి కాబట్టి మన కళ్లు కూడా గుర్తించలేవు. కూరగాయలు కోశాక వాటికి అతుక్కుని మన పొట్టలోకే చేరుతాయి. కాబట్టి మాంసాహారం, శాకాహారం రెండింటికి వేర్చేరే చాపింగ్ బోర్డులు చాలా అవసరం. ఇంకా ఇలాంటి అలవట్లు కొన్ని ఉన్నాయి. 

ఒకే స్పాంజి వాడడం
నెలల తరబడి గిన్నెలు తోమడానికి ఒకే స్పాంజిని ఉపయోగిస్తారు చాలామంది. చాలా గిన్నెలు తోమాక ఆ స్పాంజికి బ్యాక్టిరియా, హానికరమైన జెర్మ్ లు అతుక్కుంటాయి. కాబట్టి రోజుల తరబడి వాటిని వాడడం మంచికాదు. రెండు వారాలు లేదా మూడు వారాలకోసారి మార్చడం ఉత్తమం. 

కిచెన్ ప్లాట్‌ఫారాన్ని వాడడంకిచెన్ కౌంటర్ పై చపాతీలు ఒత్తడం, కూరగాయలు కోయడం వంటివి చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. అక్కడ ఓసారి వస్త్రంతో తుడిచేసి ఈ పనులు చేస్తుంటారు. కానీ సూక్ష్మక్రిములు కంటికి కనిపించనంత చిన్నవి. అక్కడ చపాతీలు ఒత్తడం వంటివి చేయడం వల్ల ఆ క్రిములు వాటితో పాటూ మన నోట్లోకే చేరుతాయి. కాబట్టి ఈ పనులు మానివేయడం ఉత్తమం. 

జూట్ బ్యాగులు శుభ్రం లేక
చాలా మంది పర్యావరణ హానికలిగించే ప్లాస్టిక్ బ్యాగులను వదిలేసి, జూట్ బ్యాగులు, పేపర్ బ్యాగులు వాడడం మొదలుపెట్టారు. ఇది మంచి పద్దతే. కానీ జూట్ బ్యాగులు కొన్ని రోజులు వాడాక సూక్ష్మక్రిములు ఆవాసంగా మారుతాయి. కానీ వాటిని నెలల తరబడి ఎవరూ ఉతకరు. అలానే వాడుతున్నారు. కూరగాయలు తెచ్చేందుకు వీటినే ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాటిని వారానికోసారైనా శుభ్రం చేయడం అవసరం. 

News Reels

గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

Published at : 30 Jan 2022 07:11 AM (IST) Tags: Health Kitchen Mistakes Health in Kitchen Donts in Kitchen

సంబంధిత కథనాలు

నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదేనా?

నువ్వుల నూనె ఆరోగ్యానికి మంచిదేనా?

పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

పళ్లు తోమకుండా నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా? ప్రయోజనాలేమిటీ?

Lipsticks: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!

Lipsticks: అమ్మాయిలూ లిప్ స్టిక్స్ వేసుకుంటున్నారా? జర భద్రం, ఇలా మీకు జరగకూడదు!

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

పాదాలు చల్లగా మారిపోతున్నాయా? ఈ వ్యాధి గురించి తెలుసుకోకపోతే గుండె ప్రమాదంలో పడినట్లే

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

Lung Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దు - అది ప్రాణాంతక లంగ్ క్యాన్సర్ కావొచ్చు

టాప్ స్టోరీస్

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

AP Minister Appalraju : ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !

AP Minister Appalraju :  ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, సీఎంవోలోకి పూనం మాలకొండయ్య

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు, సీఎంవోలోకి పూనం మాలకొండయ్య