అన్వేషించండి

Ganesh Chaturthi 2025 : వినాయక చవితి స్పెషల్.. ఇండియాలో ప్రసిద్ధి చెందిన గణపతి దేవాలయాలివే

Ganesh Temples in India : వినాయక చవితి సందర్భంగా మీరు ఇండియాలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించాలనుకుంటే ఈ ఆలయాలు బెస్ట్. ఆలయాల పేర్లు, వాటి ప్రాముఖ్యతలు చూసేద్దాం.

Must Visit Ganesh Temples in India : గణేష్ చతుర్థి 2025 (Vinayaka Chavithi 2025) సందర్భంగా చాలామంది భక్తులు వినాయకుడి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. విఘ్నాలను తొలగించి శుభాలను అందిస్తాడని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా వినాయక చవితి సమయంలో చాలామంది పవిత్రదేవాలయాలను సందర్శిస్తారు. మీరు కూడా ఈ సందర్భంగా ఇండియాలోని ప్రసిద్ధమైన వినాయకుడి ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ 5 ఆప్షన్లు ఉన్నాయి. వినాయకుడికి ప్రసిద్ధి గాంచిన ఆలయాలు ఏంటి? ఎక్కడున్నాయి? వాటి ప్రాముఖ్యత ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో వినాయకుడివి చాలా ఆలయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని చాలా పురాణమైవి. పైగా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. పురాణాలు, పవిత్రతో నిండిన ఈ ఆలయాలను లక్షలాది మంది భక్తులను దర్శిస్తారు. కోరికలు నెరవేరడంతో పాటు ఆధ్యాత్మిక ఉపశమనం లభిస్తుందని చెప్తారు. మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు.. ప్రసిద్ధమైన టాప్ 5 ఆలయాలు ఏంటో.. వాటి వెనుక ఉన్న కథలు, నిర్మాణ వైభవం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

శ్రీ సిద్ధివినాయక్ ఆలయం

(Image Source: x/ SVTMumbai)

(Image Source: x/ SVTMumbai)

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన గణేష్ దేవాలయాలలో ముంబైలోని శ్రీ సిద్ధివినాయక్ ఆలయాన్ని ఒకటిగా పరిగణిస్తారు. ఈ టెంపుల్​కు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నల్లటి బండరాయితో చెక్కిన రెండున్నర అడుగుల ఎత్తైన శ్రీ సిద్ధివినాయకుడు ఉంటాడు. ఒకే రాయితో రూపొదిద్దుకొన్న ఈ విగ్రహాన్ని అందంగా అలంకరిస్తారు. గర్భగుడిలో విగ్రహంతో ఉంటుంది. అంతేకాకుండా లోపలి భాగం అంతా బంగారం, వెండితో పొదగబడి.. చూసేందుకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. 

గణేష్ టాక్ ఆలయం

(Image Source: x/ Fundotravelclub)

(Image Source: x/ Fundotravelclub)

6,500 అడుగుల ఎత్తులో ఉన్న గ్యాంగ్‌టక్‌లోని గణేష్ టాక్ ఆలయం.. అద్భుతమైన వీక్షణలతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఎత్తైన శిఖరాలపై ఉన్న ఈ టెంపుల్​ను భక్తులు ఎక్కువగా విజిట్ చేస్తారు. ఆలయం నుంచి ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. భక్తులకు ప్రశాంతమైన వాతావరణం అందుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పర్యాటకుల రద్దీ ఉంటుంది.  కాబట్టి దానిని బట్టి మీ విజిట్ ప్లాన్ చేసుకుంటే.. ఆలయంతో పాటు ప్రశాంతమైన పరిసరాలను ఆస్వాదించగలుగుతారు.

కనిపాకం వినాయక ఆలయం

(Image Source: x/ manachittooru)
(Image Source: x/ manachittooru)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో అద్భుతమైన కనిపాకం వినాయక ఆలయం ఉంది. ఇది సహజంగా ఉద్భవించిన ఆలయం. ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉన్న గణేషుడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. నీటి బావిలో మునిగి ఉన్న విగ్రహం శతాబ్దాలుగా కోతను తట్టుకుని నిలబడింది. ఈ విషయం శాస్త్రవేత్తలను, పర్యాటకులను కూడా ఆశ్చర్యపరుస్తుంది.  ఇక్కడ ఫిబ్రవరి-మార్చి నెలల్లో పెద్ద బ్రహ్మోత్సవం జరుపుతారు.

మనకుళ వినాయగర్ ఆలయం

(Image Source: x/ Namami_Bharatam)

(Image Source: x/ Namami_Bharatam)

పాండిచ్చేరిలోని మనకుళ వినాయగర్ ఆలయం చరిత్ర, సంస్కృతితో ముడిపడి ఉంది. ఇక్కడ గొప్పగా అలంకరించిన వినాయకుడి కాంస్య విగ్రహం చూడటానికి కళ్లు రెండు సరిపోవు. డిసెంబర్-జనవరి బ్రహ్మోత్సవం సమయంలో స్వామి మరింత వైబ్రేట్‌గా కనిపిస్తారు. ఈ సమయంలో ఆలయాన్ని బాగా అలంకరించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. 

మధుర్ మహా గణపతి ఆలయం

(Image Source: x/ desiredelayer)

(Image Source: x/ desiredelayer)

కేరళలో ఉన్న మధుర్ మహా గణపతి ఆలయం వెయ్యేళ్ల నాటి ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణ మధురాష్టకం శ్లోకంతో ఇది ముడిపడి ఉంది. శతాబ్దాల నాటి ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ టెంపుల్​ని కూడా చాలామంది చూసేందుకు వెళ్తూ ఉంటారు. 

మీరు కూడా వినాయక చవితి సమయంలో లోకల్​వే కాకుండా వేరేవి చూడాలనుకుంటే ఈ ఆలయాలను హ్యాపీగా విజిట్ చేయవచ్చు. కుటుంబంతో లేదా ఫ్రెండ్స్​తో వెళ్లగలిగేందుకు బెస్ట్ ప్లేస్​లు ఇవి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
గోవా నైట్ క్లబ్‌లో విషాదం.. సిలిండర్ పేలుడుతో 25 మంది మృతి- విచారణకు ఆదేశించిన సీఎం
Indigo Show Cause Notice: ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
ఇండిగో సీఈవోకు DGCA నోటీసులు.. గందరగోళంపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం
Telangana Rising Global Summit Agenda: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అజెండా ఖరారు.. హాజరయ్యే సినీ, క్రీడా ప్రముఖులు వీరే
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
భారత్‌లో అతి చవకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్.. 800 Km రేంజ్, లిస్ట్ చూశారా
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
Embed widget