Vaikunta Ekadasi Upavasam Tips : వైకుంఠ ఏకాదశి ఉపవాసం.. ఫాస్టింగ్ చేసేప్పుడు ఇవి ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిదట
Vaikunta Ekadasi 2025 : పండుగల సమయంలో చాలామంది ఉపవాసం చేస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున చాలామంది ఫాస్టింగ్‌లో ఉంటారు. ఈ సమయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు.
Vaikunta Ekadasi Fasting Tips : వైకుంఠ ఏకాదశి 2025 రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. ఆ సమయంలో ఉపవాసం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పైగా వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని చెప్తారు. అందుకే చాలామంది ఈ సమయంలో ఉపవాసం చేస్తారు. మీరు కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేస్తే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఇవి మీరు హెల్తీగా ఉపవాసాన్ని చేయడంలో హెల్ప్ చేస్తాయి.
ఉపవాసం చేసేముందు..
మీరు ఉపవాసం చేసేముందు కచ్చితంగా మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలి. మీ శరీరం ఫాస్టింగ్ చేయడానికి సహకరిస్తుందో లేదో తెలుసుకుంటే మంచిది. డాక్టర్ని కలిస్తే మరీ మంచిది. ఉపావాసానికి ముందు శరీరానికి నీటిని అందించి.. దానిని ప్రిపేర్ చేయాలి. ఇది మీరు ఫాస్టింగ్ సమయంలో డీహైడ్రేట్ కాకుండా హెల్ప్ చేస్తుంది.
ఉపవాస సమయంలో..
కొందరు ఉపవాసం చేసేప్పుడు నీళ్లు కూడా తాగారు. అది మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. మీరు అప్పుడప్పుడు నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా.. ఎక్కువ సేపు ఉపవాసముండడంలో హెల్ప్ చేస్తుంది. పైగా కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు రావు. మీ శరీరం చెప్పే మాట వినాలి. బలవంతంగా దానిని ఇబ్బంది పెట్టకూడదు. కళ్లు తిరిగినట్లు అనిపించినా.. వాంతులు అయ్యేట్టు ఉన్నా.. ఇతర ఇబ్బందలు పడుతున్నట్లు అనిపిస్తే.. మీ ఉపవాసాన్ని ఫ్రూట్స్‌తో బ్రేక్ చేయండి. లేదా వైద్య సహాయం తీసుకోండి. ఉపవాసం చేసేప్పుడు ఇతర ఫిజికల్ యాక్టివిటీలు లేకుండా చూసుకోండి. దైవ సన్నిధిలో సమయం గడపండి. ఇతర పనులు చేసుకోవడం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది.
ఉపవాసాన్ని ఎలా బ్రేక్ చేయాలంటే..
ఎక్కువసేపు ఉపవాసం ఉండి.. దానిని బ్రేక్ చేయాలనుకున్నప్పుడు పోషకాలతో కూడిన.. త్వరగా జీర్ణమయ్యే ఫుడ్స్‌ని మాత్రమే తీసుకోవాలి. లైట్ మీల్ అయితే మరీ మంచిది. హెవీ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండండి. నూనెలో ఫ్రై చేసినా, స్పైసీ ఫుడ్ ఉపవాసం తర్వాత తింటే ఇబ్బందిని కలిగిస్తాయి. నీరు ఎక్కువగా తాగండి. లేదా ఇతర ఫ్లూయిడ్స్‌ని తీసుకోవడం మంచిది.
ఫాలో అవ్వాల్సిన టిప్స్
పండుగ రోజే కాకుండా.. మీరు ఎప్పుడూ ఫాస్టింగ్ చేసినా ఎక్కువ సేపు కాకుండా 12 నుంచి 14 గంటలు ఉపవాసం ఉండేలా చూసుకోండి. దీనిని శరీరం అర్థం చేసుకుని.. పండుగల సమయంలో ఉపవాసం ఉండడంలో సహకరిస్తుంది. ఫాస్టింగ్ సమయంలో శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలేట్స్ అందిస్తే మంచిది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిలో మార్పులు గమనిస్తే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.
ఉపవాసం అందరికీ మంచిది కాదు. కానీ మూర్ఖంగా దానిని చేయాలని.. శరీరాన్ని ఇబ్బంది పెడితే ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మీరు నిజంగా ఉపవాసం ఉండాలనుకున్నప్పుడు మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం ఫాస్టింగ్ చేయండి. అనంతరం మీ విండ్‌ని బ్రేక్ చేయండి. లేదా ఫ్లూయిడ్స్, పండ్లతో ఇబ్బందులు రాకుండా చూసుకోండి.
Also Read : సంక్రాంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విష్ చేసేయండిలా