Mango Recipes: పచ్చి మామిడితో ఇలా చట్నీ చేస్తే దోశె, ఇడ్లీలోకి అదిరిపోతుంది - వేసవి తాపం తగ్గుతుంది కూడా
పచ్చి మామిడి వేసవిలో అధికంగా లభిస్తుంది. వీటితో చేసే కొన్ని రెసిపీలు ఇవిగో.
వేసవిలో పచ్చి మామిడి అధికంగా లభిస్తుంది..దీన్ని తింటే ఎంతో ఆరోగ్యం. వీటిలో విటమిన్ A, B6, C, K పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, సోడియం క్లోరైడ్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ సి, కాల్షియం ఐరన్ నిండుగా ఉంటాయి. వేసవిలో అధికంగా చెమట పడుతుంది. చెమటతో పాటూ ఎలక్ట్రోలైట్లు బయటికి పోతాయి. దీని వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. వేసవిలో పచ్చిమామిడిని తినడం వల్ల అధిక చెమట వల్ల ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపవచ్చు. వేసవిలో పచ్చిమామిడి కాయని తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. అలసట తగ్గుతుంది. తెల్లరక్తకణాల సంఖ్య పెంచేందుకు తద్వారా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే సాధారణ జలుబు ఫ్లూని కూడా పచ్చిమామిడి నివారిస్తుంది. పచ్చి మామిడి కాయతో చేసే కొన్ని సింపుల్ రెసిపీలు ఇవిగో.
పచ్చి మామిడి పచ్చడి
కావాల్సిన పదార్థాలు
మామిడి కాయ - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
అల్లం తరుగు - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - రెండు
పచ్చి మిర్చి - రెండు
రాతి ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. పచ్చి మామిడిని తొక్కతీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
2. ఒక గిన్నెలో మామిడి ముక్కలు, అల్లం తరుగు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, రాతి ఉప్పు, ఉల్లిపాయ తరుగు వేసి బాగా ఉడికించాలి.
3. వాటిని చల్లార్చి, మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
4. ఒక గిన్నెల్లోకి ఆ మిశ్రమాన్ని తీసి, తాళింపు వేసుకోవాలి.
5. దీన్ని ఇడ్లీ, దోశెతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
...........................
పచ్చి మామిడికాయ రైతా
కావలసిన పదార్థాలు
పచ్చిమామిడి తురుము - ఒక కప్పు
పెరుగు - ఒకటిన్నర కప్పు
కారం - అర స్పూను
జీలకర్ర పొడి- అర స్పూను
ఆవాలు - అర స్పూను
మినపప్పు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
నూనె - ఒక స్పూను
కరివేపాకులు - రెండు రెమ్మలు
తయారీ ఇలా
1. పెరుగు బాగా గిలక్కొట్టండి. అందులో ఉప్పు, పచ్చి మామిడికాయ తురుము, కారం,జీలకర్ర పొడి వేసి కలపాలి
2. స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేయాలి.
3.నూనె వేడెక్కాక ఇంగువ వేయాలి. మినపప్పు, ఆవాలు వేసి వేయించాలి
4. కరివేపాకులు కూడా వేసి వేయించాలి.
5. ఈ తాళింపును పెరుగు మిశ్రమంలో వేయాలి.
6. పచ్చి కాయ తురుముతో రైతా రెడీ అయినట్టే.
దీన్ని తింటే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. దీన్ని ఉత్తగా తిన్నా బావుంటుంది, లేదా ఘాటైనా బిర్యానీలలో కలుపుకుని తింటే అదిరిపోతుంది.
Also read: ఈ తేనె ఖరీదు 9 లక్షల రూపాయలు, ఇది ఎందుకంత కాస్ట్లీయో తెలుసా
Also read: ఎక్కువసేపు ఫోన్ చూస్తే మొటిమలు వచ్చే అవకాశం, రాకుండా ఇలా నివారించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.